శనివారం 30 మే 2020
Karimnagar - Feb 05, 2020 , 02:10:08

గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

సైదాపూర్‌: గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైన నిధులను అందిస్తున్నదని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని వెన్కేపల్లి, సైదాపూర్‌, దుద్దనపల్లి గ్రామాల్లో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను ప్రారంభించారు.  లస్మన్నపల్లిలో కేవీకే ఆధ్వర్యంలో ఎస్సీ కుటుంబాలకు వనరాజ కోళ్లు, కుట్టుమిషన్లు, పవర్‌స్ప్రేల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కృషి విజ్ఞాన కేంద్రం ఎస్సీ కుటుంబాలను ఆర్థికంగా వృద్ధిలోకి తెచ్చేందుకు ఇలాంటి పనిముట్లను అందించడం హర్షణీయమన్నారు.  లస్మన్నపల్లి సర్పంచ్‌ కాయితరాములుకు 30 రోజుల ప్రణాళికలో ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు రావడం అభినందనీయమన్నారు. 


గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందనీ, దశలవారీగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.జడ్పీ వైస్‌చైర్మన్‌ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, తాసిల్దార్‌ దేవేందర్‌రావు, ఎంపీడీవో పద్మావతి, శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్‌రావు, ప్రభాకర్‌, ప్రశాంతి, వేణుగోపాల్‌, సింగిల్‌విండో చైర్మన్లు సారబుడ్ల రాజిరెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, సర్పంచ్‌లు చంద శ్రీనివాస్‌, కాయిత రాములు, కొండ గణేశ్‌, కొత్త రాజిరెడ్డి, తాటిపల్లి యుగేందర్‌రెడ్డి, ఆవునూరి పాపయ్య, ఎంపీటీసీలు జంపాల సంతోష్‌, చాడ చైతన్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, ఏఎంసీ డైరెక్టర్‌ పోలు ప్రవీణ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కమిటి సభ్యుడు చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి,  దిశ కమిటీ సభ్యులు బర్మావత్‌ శ్రీనివాస్‌తోపాటు నాయకులు, కార్యకర్తలున్నారు.logo