మంగళవారం 26 మే 2020
Karimnagar - Feb 04, 2020 , 01:34:50

అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతాం

 అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతాం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీం‘నగరం’లో అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతామని నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదివారం రాత్రి చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా కరీంనగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియామకమైన ఆమె సోమవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. స్మార్ట్‌సిటీతో పాటుగా, ప్రభుత్వం చేపట్టే ఇతర ప్రాజెక్టులకు కూడ ప్రాధాన్యం ఇచ్చి పనులు చేపడుతామన్నారు. ప్రజలకు మున్సిపాలిటీ నుంచి సక్రమంగా సేవలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పారిశుధ్యం మరింత మెరుగుపరచడమే ప్రాధాన్య అంశంగా పనిచేస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన కమిషనర్‌కు అడిషనల్‌ కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, ఎస్‌ఈ భద్రయ్య, టౌన్‌ ప్లానింగ్‌ విభాగం, పారిశుధ్య విభాగం, మెప్మా సిబ్బంది, తదితరులు అభినందనలు తెలిపారు.


logo