బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 04, 2020 , 01:29:12

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

తిమ్మాపూర్‌ రూరల్‌: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులందరూ లబ్ధి పొందేలా చూడాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు సూచించారు. మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో గల క్యాంపు కార్యాలయంలో ఆయనను కలవడానికి వచ్చిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలతో మాట్లాడారు. ప్రజలను స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మానకొండూర్‌ మండలం చంజర్ల గ్రామానికి చెందిన గోగూరి భాగ్యలక్ష్మికి రూ.14,500, సామాల సంధ్యకు రూ.40వేలు విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యం బారిన పడిన పేదలకు ఈ పథకం వరం లాంటిదని ఆయన ఉద్ఘాటించారు. కార్యక్రమాల్లో మానకొండూర్‌ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్‌, తిమ్మాపూర్‌ సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ఇనుకొండ జితేందర్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo