గురువారం 28 మే 2020
Karimnagar - Feb 03, 2020 , 04:09:02

విద్యాభివృద్ధికి విరివిగా నిధులు

విద్యాభివృద్ధికి విరివిగా నిధులు
  • పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాంటిస్సోరి వార్షికోత్సవానికి హాజరు

హుజూరాబాద్‌టౌన్‌ : విద్యా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రాజీలేకుండా నిధులు మంజూరు చేస్తున్నదనీ, ప్రభుత్వ విద్యారంగ పథకాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ఆదివారం రాత్రి పట్టణంలోని మాంటిస్సోరి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల పదో వార్షికోత్సవాన్ని ‘విస్మయ-2020’ పేరిట ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువు మార్కులకే ప్రామాణికం కాదనీ, విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలను ఇనుమడింపజేసేలా ఉపాధ్యాయ వృత్తి ఉండాలని సూచించారు. విద్యలో రాణించి హు జూరాబాద్‌ నియోజకవర్గానికి విద్యార్థులు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. అనంతరం ఇటీవల గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సాధించిన నాట్య విద్యార్థినిని మెమొంటోతో ఘనంగా సత్కరించారు. 


అనంతరం మాంటిస్సోరి గ్రూప్‌ స్కూల్స్‌ చైర్మన్‌ జోస్‌ నెడుతుండమ్‌ మాట్లాడుతూ బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్న లక్ష్యంతో మాంటిస్సోరి విద్యాసంస్థలను ఏర్పాటు చేశామనీ, ఎక్కడా రాజీ పడకుండా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇనుమడింపజేస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, నాటికలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మాంటిస్సోరి గ్రూప్‌ స్కూల్స్‌ ప్రెసిడెంట్‌ గండ్ర సుధాకర్‌రెడ్డి, టీ సుధాకర్‌, అకాడమిక్‌ డైరెక్టర్లు బైజు వర్గీస్‌, పాఠశాల డైరెక్టర్లు టీ సుధాకర్‌రెడ్డి, విపిన్‌కుమార్‌, శివారెడ్డి శంకర్‌, మల్లయ్య, రాజిరెడ్డి, సుభాష్‌, ప్రవీణ్‌, నూకల శ్రీనివాస్‌రావు, షాజుథామస్‌, హెచ్‌ఎం గీతాషాజు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు కే విజయ, డిప్యూటి డైరెక్టర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్‌, హుజూరాబాద్‌, జమ్మికుంటల మున్సిపల్‌ చైర్మన్లు గందె రాధిక-శ్రీనివాస్‌, టీ రాజేశ్వర్‌రావు, కొలిపాక నిర్మల-శ్రీనివాస్‌, ఎంపీపీ ఇరుమల్ల రాణిసురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కొండాల్‌రెడ్డి, ఎంఈవోలు శ్రీనివాస్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.logo