గురువారం 28 మే 2020
Karimnagar - Feb 03, 2020 , 04:03:20

బ్రహ్మోత్సవ వైభవం

బ్రహ్మోత్సవ వైభవం
  • ఘనంగా మహాపూర్ణాహుతి, చక్ర తీర్థోత్సవం, వసంతోత్సవం
  • నేడు శోభాయాత్ర
  • హాజరైన సీపీ కమలాసన్‌రెడ్డి, మేయర్‌ సునీల్‌రావు

సుభాష్‌నగర్‌: మార్కెట్‌రోడ్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి తృతీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం మంత్రి గంగుల కమలాకర్‌-రజిత దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విశేష పూజలు చేశారు. ఉదయం ఆరాధన సేవాకాలం, మూల మంత్ర హవనం, శాంతి పాఠం, చతుస్థానారచన, పరివార హోమంతోపాటు మహా పూర్ణాహుతి, చక్ర తీర్థోత్సవం, వసంతోత్సవం, బలిహరణం, తీర్థగోష్టి నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం అశేష భక్తజనులు ఆలపించగా, ఆలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. అలాగే స్వామికి శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, సప్తవర్ణాలు, ధ్వజారోహణ, ఏకాంతసేవ, పండిత సన్మానం, మహదాశీర్వచనం, తదితర విశేష పూజలను చేశారు. పూజల్లో సీఎంఓ కార్యదర్శి వేణుగోపాల్‌రావు, సీపీ కమలాసన్‌రెడ్డి, నగర మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపరాణి-హరిశంకర్‌, ఆలయ ఈఓ కిషన్‌రావు దంపతులు, కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా, ఈ నెల 25న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు సోమవారం సాయంత్రం నగరంలో నిర్వహించనున్న శోభాయాత్రతో ముగియనున్నాయి.logo