గురువారం 28 మే 2020
Karimnagar - Feb 02, 2020 , 01:46:36

ఎల్‌ఐసీ ఉద్యోగుల ఆగ్రహం

ఎల్‌ఐసీ ఉద్యోగుల ఆగ్రహం

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)దేశ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద సంస్థగా ఉన్న ఎల్‌ఐసీని లిస్టింగ్‌ చేయడాన్ని అత్యంత చీకటి రోజుగా పరిగణిస్తున్నామని ఆ సంస్థ ఉద్యోగులు తీవ్రంగా మండి పడ్డారు. శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎల్‌ఐసీని లిస్టింగ్‌ చేస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లాలోని అన్ని ఎల్‌ఐసీ కార్యాలయాల ఎదుట ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. కరీంనగర్‌- 1,2, హుజూరాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, రామగుండం కార్యాలయాల ఎదుట ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు రాజేందర్‌, రమణ, మల్లేశం, రవీంద్రనాథ్‌, వాణి, సూర్యకళ, భసవేశ్వర్‌, శ్రీనివాస్‌, అంజన్‌బాబు, గట్టయ్య, అనుపమ, శ్రీధర్‌ తదితరుల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. 


ఈ సందర్భంగా పలువురు నాయకులు, మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో ఏటా 10 శాతం నిధులు సమకూర్చుతున్న ఎల్‌ఐసీని ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. 31 లక్షల కోట్ల ఆస్తులు, 28 లక్షల కోట్ల బీమా నిధులు ఉండి అత్యధిక లాభాలు గడిస్తున్న సంస్థను ప్రైవేటీకరించేందుకే లిస్టింగ్‌ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ నెల 4వ తేదీన గంట పాటు సమ్మె చేస్తున్నామనీ, క్లాస్‌-1, క్లాస్‌-2 యూనియన్లతో సమాలోచనలు చేసి, విశాల ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.


logo