ఆదివారం 31 మే 2020
Karimnagar - Feb 01, 2020 , 04:03:58

సహకార ఎన్నికల్లోనూ విజయం మనదే

 సహకార ఎన్నికల్లోనూ విజయం మనదే
  • ప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  • కురిక్యాలలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం

గంగాధర: సహకార సంఘాల ఎన్నికల్లోనూ విజయం తమదేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ధీమా వ్యక్తంచేశారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కురిక్యాలలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సహకార ఎన్నికల సమాయత్తంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలో 17 సహకార సంఘాలు ఉన్నాయనీ, అన్నింటినీ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునేలా కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే సహకార సంఘాలు బలోపేతమయ్యాయనీ, రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు. మండలాల వారీగా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి అందరి అభిప్రాయం మేరకు సరైన వారికి అవకాశం ఇస్తామనీ, గ్రూపు రాజకీయాలు చేయకుండా పార్టీ సూచించిన అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. 


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్‌ గల్లంతయిందనీ, కాంగ్రెస్‌ పత్తాలేకుండా పోయిందనీ, సహకార సంఘాల ఎన్నికల్లో కూడా ఆ పార్టీలకు ఇదే పరిస్థితి ఎదురు కాబోతోందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముదుంగటి సురేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రేమ్‌సాగర్‌రావు, కేడీసీసీబీ డైరెక్టర్‌ వెలిచాల తిర్మల్‌రావు,  చొప్పదండి, బోయినిపల్లి ఎంపీపీలు రవి, వేణు, మల్యాల జడ్పీటీసీ రాంమోహన్‌రావు, మల్యాల, రామడుగు ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు వొడ్నాల రాంరెడ్డి, వొంటెల మురళీకృష్ణారెడ్డి, గంగాధర, కొడిమ్యాల, చొప్పదండి టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు నవీన్‌రావు, రాఘవరెడ్డి, అజయ్‌, నాయకులు పుల్కం నర్సయ్య, దూలం బాలగౌడ్‌, మెన్నేని రాజనర్సింగరావు, పునుగోటి కృష్ణారావు, గడ్డం చుక్కారెడ్డి, ఇప్పనపెల్లి సాంబయ్య, ఐలినేని సాగర్‌రావు, గడ్డం చుక్కారెడ్డి, గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు


logo