బుధవారం 27 మే 2020
Karimnagar - Feb 01, 2020 , 03:40:10

మెరుగైన సేవలందించాలి

 మెరుగైన సేవలందించాలి

గంగాధర: దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రత్యేక కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశించారు. గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో నిర్వహిస్తున్న జాతీయ, రాష్ట్రస్థాయి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజు వారి ఇన్‌ పేషెంట్‌, అవుట్‌ పేషెంట్‌ వివరాలు, రోగులకు  అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో ఉన్న సౌకర్యాలు, ల్యాబ్‌, ఆపరేషన్‌ థియేటర్‌, ఇన్‌ పేషెంట్‌ వార్డు, ఫార్మసీని పరిశీలించారు. దవాఖానలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. రోగులు ప్రైవేటు దవాఖానకు వెళ్లకుండా సిబ్బంది అంకిత భావంతో పని చేయాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలనీ, ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు పెంచాలని ఆదేశించారు. ఇక్కడ దవాఖాన సిబ్బంది ఉన్నారు.


logo