శుక్రవారం 29 మే 2020
Karimnagar - Jan 31, 2020 , 04:08:19

ప్రజాసేవే ధ్యేయంగా పనిచేయాలి..

ప్రజాసేవే ధ్యేయంగా పనిచేయాలి..
  • చొప్పదండి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
  • హుజూరాబాద్‌లో గందె రాధిక..
  • ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

చొప్పదండి/హుజూరాబాద్‌ నమస్తేతెలంగాణ: నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసేవే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. చొప్పదండి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా గుర్రం నీరజ గురువారం పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రతి ఇంటికీ చేరవేసేందుకు కృషి చేయాలని సూచించారు. మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న చొప్పదండిని మున్సిపల్‌గా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుకే దక్కుతుందన్నారు. చొప్పదండి మున్సిపల్‌కు జరిగిన తొలిపోరులో ప్రజలు రాష్ట్ర సర్కారు పథకాలు మెచ్చి 14 సీట్లలో 9 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి, మున్సిపల్‌పై గులాబీజెండాను ఎగురవేసేందుకు సహకరించారనీ, వారికి రుణపడి ఉంటామని తెలిపారు. అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామనీ, కొద్దిరోజుల్లోనే  సెంటర్‌లైటింగ్‌, క్రీడాకారులకు మినీస్టేడియం, ఓపెన్‌ జిమ్‌, పార్కు ఏర్పాటు చేయిస్తామనీ, ప్రతి వీధిలో సీసీరోడ్డు, మురుగు కాలువల నిర్మాణం, వీధి లైట్ల ఏర్పాటు, ఇంటింటికీ నల్లానీటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. 


మున్సిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, చొప్పదండి చరిత్రను తిరగరాస్తామన్నారు. మున్సిపల్‌ గెలిచిన చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు ప్రజలకు సేవకులుగా పనిచేసి, అభివృద్ధిలో భాగస్వాములు  కావాలని పిలుపునిచ్చారు.  అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టిన చైర్‌పర్సన్‌ నీరజ, వైస్‌ చైర్‌పర్సన్‌ ఇప్పనపల్లి విజయలక్ష్మి, కౌన్సిలర్లు నలుమాచు జ్యోతి, మహుశుని సంధ్య, బిజిలి అనిత, మాడూరి శ్రీను, వడ్లూరి గంగరాజు, దండె జమున, కొత్తూరి మహేశ్‌, కొత్తూరి స్వతంత్రభారతి, చేపూరి హేమ, పెరుమాండ్ల మానస, రాజన్నల ప్రణీత, కొట్టె అశోక్‌ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవి, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య,  మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌కుమార్‌, మాజీ ఎంపీపీలు గుర్రం భూమారెడ్డి, క్రిష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌, పట్టణాధ్యక్షుడు కొత్త గంగారెడ్డి, నాయకులు గడ్డం చుక్కారెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, నలుమాచు రామక్రిష్ణ, మాచర్ల వినయ్‌, గుర్రం హన్మంతరెడ్డి, గుర్రం ఇంద్రసేనారెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మచ్చ రమేశ్‌, గొల్లపల్లి శ్రావణ్‌, మంద నర్సయ్య,  సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


బాధ్యతలు చేపట్టిన గందె రాధిక

హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గందె రాధిక-శ్రీనివాస్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కమిషనర్‌ ఈ జోన ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ, పట్టణాన్ని సుందరంగా మార్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్‌ అండదండలతో అధిక నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ ఐదేళ్లలో ప్రతి వాడకు సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు, తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల-శ్రీనివాస్‌ కూడా బాధ్యతలు చేపట్టారు. అనంతరం చైర్‌పర్సన్‌ దంపతులను జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, కౌన్సిలర్లు, ఫొటో స్టూడియో అసోసియేషన్‌ నాయకుడు రవీందర్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నా యకులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, గజమాల, పూలమాల, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.


logo