బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 31, 2020 , 03:56:32

శ్రీవేంకటేశా.. గోవిందా..

శ్రీవేంకటేశా.. గోవిందా..
  • కొనసాగుతున్న మార్కెట్‌రోడ్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
  • పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • కన్నులపండువగా కల్పవృక్ష, గజవాహన సేవలుకార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీం‘నగరం’లోని మార్కెట్‌ రోడ్డు వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది.  గురువారం ఉదయం ఆరాధన, సేవాకాలం, చతుస్థానార్చన, పరివార హోమం, మూలమంత్ర హవనం, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థప్రసాదగోష్టి నిర్వహించారు. ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే, సాయంత్రం స్థానిక మంచిర్యాల చౌరస్తాలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఉంచి అశ్వ, గజ వాహనంపై ఎదుర్కోలు ఉత్సవం కన్నులపండువగా నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్‌, తదితరులు పాల్గొన్నారు.


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తిపారవశ్యంలో ముంచెత్తుతున్నాయి.  ఉదయం ఉషా బృందం పారాయణం, గోపాల్‌పూర్‌ శ్రీ వెంకటేశ్వర భజన మండలి భజన, రాధాక్రిష్ణ భజన మండలి భజన అలరించాయి. సాయంత్రం భగత్‌నగర్‌కు చెందిన పావని బృందంతో భక్తి సంకీర్తనలు, కాసు మధు, కుమారి సంధ్య వారి కీర్తనలు, హైదరాబాద్‌కు చెందిన ఫ్యూజియన్‌ డ్యాన్స్‌ కార్యక్రమాలు, లతిత, శ్రీకృతి సినీ భక్తి సంగీతం, స్వరాంజలి కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మోహనస్వామి, కాసు మహేందర్‌రాజు, కిట్ల శ్రీనివాస్‌ బృందం ఘంటసాల భక్తి గీతాలపనతో భక్తులను రంజింపజేశారు.


నేడు కళ్యాణం..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, లక్ష్మీనారాయణుల కల్యాణమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వీటితో పాటు గరుడ వాహన సేవ చేపట్టనున్నారు. logo