శనివారం 30 మే 2020
Karimnagar - Jan 31, 2020 , 04:03:22

కేటీఆర్‌ను కలిసిన పాలకవర్గాలు

కేటీఆర్‌ను కలిసిన పాలకవర్గాలు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ నగర మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వ రూపరాణి  గురువారం జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా  ఆయనకు పూల మొక్క అందించి కృతజ్ఞతలు తెలిపారు. వీరి తో పాటుగా బుధవారం పాలకవర్గ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సైతం మంత్రి కేటీఆర్‌ను కలుసుకున్నారు. కాగా పాలకవర్గ సభ్యులను కేటీఆర్‌ అభినందించారు.


కేటీఆర్‌ను కలిసి కొత్తపల్లి మున్సిపల్‌ పాలక వర్గం

కొత్తపల్లి పాలకవర్గం..

కరీంనగర్‌ రూరల్‌: హైదరాబాద్‌లోని తెలంగాణ  భవన్‌లో  పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను   కొత్తపల్లి పాలకవర్గ సభ్యులు గురువారం కలిశా రు. పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు చెప్పారు.   మున్సిపల్‌  చైర్మన్‌ రుద్రరాజు, వైస్‌ చైర్‌పర్సన్‌ బండ రాధ, వార్డు సభ్యులు గండు రాంబా బు,జేరిపోతుల మొండయ్య, మా నుపాటి వేణుగోపాల్‌, చింతల సత్యనారాయణ, జెరిపోతుల అంజలి, నాజీయా,  ఎండీ జమిలోద్దీన్‌ ఉన్నారు.  logo