శనివారం 06 జూన్ 2020
Karimnagar - Jan 31, 2020 , 03:55:23

వినోద్‌కుమార్‌ను కలిసిన మేయర్‌

వినోద్‌కుమార్‌ను కలిసిన మేయర్‌

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ మేయర్‌గా ఎన్నికైనా వై సునీల్‌రావు గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను ఆయన నివాసంలో కలిశాడు. పూల మొక్క అందించి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ సందర్భంగా మేయర్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అభినందనలు తెలిపారు. స్మార్ట్‌సిటీ పనులను వేగవంతం చేయాలని, మిగిలిన పనులకు సంబంధించి టెండర్‌ పక్రియను సత్వరమే పూర్తి చేసే విధంగా చూడాలని మేయర్‌కు సూచించారు. కరీంనగర్‌ సమగ్ర అభివృద్ధ్దికి తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. logo