శనివారం 06 జూన్ 2020
Karimnagar - Jan 30, 2020 , 04:26:07

డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి..

డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి..
  • ఏకగ్రీవంగా ఎన్నిక
  • కార్పొరేషన్‌పై మరోసారి ఎగిరిన గులాబీ జెండా
  • భారీ ర్యాలీ.. సంబురాలు
  • అభినందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌, మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు రసమయి, సుంకె
  • అట్టహాసంగా ప్రమాణస్వీకారం
  • కొలువుదీరిన కొత్త పాలకవర్గం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ నగరపాలక సంస్థలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన 60 మంది కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశ మందిరానికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ముందుగా శ్వేత హోటల్‌లో సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి 40 మంది సభ్యులు గులాబీ కండువాలు వేసుకొని సమావేశానికి వచ్చారు. అలాగే, 13 మంది బీజేపీ నాయకులు కూడా కాషాయ కండువాలతో సమావేశానికి రాగా, ఆరుగురు ఎంఐఎం సభ్యులు పార్టీ కండువాలతో హాజరయ్యారు. వీరితోపాటు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా వచ్చారు. సభ్యులందరితోనూ జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తెలుగు అక్షరమాల ప్రకారంగా ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మేయర్‌ వై సునీల్‌రావు, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్‌' అంటూ నినదించగా.. బీజేపీ కార్పొరేటర్‌ కచ్చు రవి ‘భారత్‌మాత కీ జై’ అంటూ నినదించారు. ప్రమాణ స్వీకారం అనంతరం బీజేపీ సభ్యులు వెళ్లిపోయారు. 


logo