శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Jan 29, 2020 , 04:32:34

నేడే మేయర్‌ ఎన్నిక

నేడే మేయర్‌ ఎన్నిక
  • మొదట సభ్యుల ప్రమాణ స్వీకారం
  • ఏర్పాట్లు చేసిన అధికారులు
  • పరిశీలించిన జేసీ, నగర కమిషనర్‌
  • టీఆర్‌ఎస్‌కు దక్కనున్న పదవులు

 కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలను బుధవారం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్నికైన సభ్యులతో నగర కమిషనర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు ని ర్వహిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి నగరపాలక అధికారులు బల్దియా సమావేశమందిరంలో అ న్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. 60 మంది సభ్యులతో పాటు, ఎక్స్‌అఫీషియో సభ్యులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మేయర్‌, డిప్యూటీ మేయర్లను చేతులు ఎత్తే విధానంలో ఎన్నికోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కోరం సభ్యులు హాజరైతే మేయర్‌ ఎన్నికను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. కాగా, ఇప్పటికే నగరపాలక సంస్థలో టీఆర్‌ఎస్‌కు 33 మంది సభ్యుల బలం ఉంది. దీనికి తోడు గెలిచిన 8 మంది స్వ తంత్ర, ఫార్వర్డ్‌బ్లాక్‌ సభ్యుల్లో ఏడుగురు మంగళవారం మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం 40కి చేరింది. కాగా, ఇప్పటికే టీఆర్‌ఎస్‌ విజేంతలందరూ క్యాంపులోనే ఉ న్నారు. అయితే నగరపాలక సంస్థ మేయర్‌ స్థానం జనరల్‌కు కేటాయించడంతో పలువురు నాయకులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. కాగా, క్యాంపులో ఉన్న టీఆర్‌ఎస్‌ సభ్యులందరూ బుధవారం ఉదయం నేరుగా నగరపాలక సంస్థ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. మేయర్‌, డిప్యూటీ మేయర్ల అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయం మేరకు ఎన్నుకోనున్నారు. బుధవా రం ఉదయం జరిగే సమావేశానికి బీజేపీ, ఎంఐఎం సభ్యులు కూడ హాజరుకానున్నారు. కాగా జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌, బల్దియా కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.


logo