శనివారం 30 మే 2020
Karimnagar - Jan 29, 2020 , 04:30:36

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు తమపై విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారనీ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర, ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యులు ఏడుగురు మంగళవారం మంత్రి గంగుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు తరలివెళ్లి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ దళంలో చేరారు. వారిని మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ఎన్నికలు ఏవైనా గెలుపు గులాబీదేనన్నారు. ప్రజలు ఇచ్చిన బలంతో మరింత ఉత్సాహంతో పని చేసి నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. పల్లెలను ప్రగతి బాట పట్టించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టణాలను కూడ అదే స్థాయిలో తీర్చిదిద్దుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో కార్పొరేషన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పాటుపడుతామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసే ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లో ఆదరించి పట్టం కట్టారన్నారు. ప్రజలకు మంత్రి గంగుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గుగ్గిళ్లపు రమేశ్‌, నందెల్లి మహిపాల్‌, సంపత్‌రావు, శ్యాం, సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


బల్దియాలో పెరిగిన టీఆర్‌ఎస్‌ బలం

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో టీఆర్‌ఎస్‌ బలం 40కి పెరిగింది. నగరపాలక సంస్థలో 60 డివిజన్లు ఉండగా 20, 37వ డివిజన్లలో ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. కాగా సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపుతో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల సంఖ్య 33కు చేరింది. కాగా ఈ ఎన్నికల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వతంత్రులు కలిపి 8 మంది ఎన్నిక కాగా... వీరిలో ఏడుగురు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ భవన్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇందులో 9, 11, 40 డివిజన్లలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి గెలుపొందిన ఐలేందర్‌యాదవ్‌, ఆకుల నర్మద, కొటగిరి భూమాగౌడ్‌లు, 18, 19, 31, 50 డివిజన్లలో విజయం సాధించిన స్వతంత్రులు సుదగోని మాధవి, ఎదుల్ల రాజశేఖర్‌,  లెక్కల స్వప్న, కోలిపాక అంజయ్య ఉన్నారు. వీరి చేరికతో బల్దియాలో టీఆర్‌ఎస్‌ బలం 40కి పెరిగింది. logo