ఆదివారం 31 మే 2020
Karimnagar - Jan 29, 2020 , 04:25:57

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

గంగాధర:  ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. పెద్దలు నిశ్చితార్థం చేశారు. కానీ ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి ఆవేదన వ్య క్తం చేసింది. తనకు న్యాయం చేయాలని మంగళవారం ప్రియుడి ఇంటి ఎదుట భైఠాయించి నిరసన తెలిపింది.   వివరాలు..మండలంలోని కోట్ల నర్సింహులపల్లి గ్రామానికి చెందిన మల్లారపు మమత (20), మధురానగర్‌  పంచాయతీ పరిధిలోని పత్తికుంటపల్లికి చెందిన గంగాధర చంద్రమౌళి (24) ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో  ఏడాది క్రితం రెండు కుటుంబాల సాక్షిగా నిశ్చితార్థం చేశారు.  కాగా చంద్రమౌళికి తనకంటే పెద్దవారైన అన్నలకు వివాహం కాకపోవడంతో వారికి పెండ్లి అయిన తరువాతే వివాహం జరిపిస్తామని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పదం జరి గింది. అబ్బాయి తల్లిదండ్రులు చంద్రమౌళితో మమతను కలువనీయకుండా ఎక్కడో దా చిపెట్టారని పేర్కొంటూ మంగళవారం పత్తికుంటపల్లిలో ని అబ్బాయి ఇంటిముందు మమత బైఠాయించి ఆందోళనకు దిగింది. ఈ విషయంపై ఎస్‌ఐ వివేక్‌ను  అడగ్గా   మమత ఆందోళన చేపట్టిన విష యం వాస్తమే అన్నారు.  ఆమెకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎంత నచ్చచెప్పినా మమత విరమించడం లేదన్నారు. పలుమార్లు కౌన్సెలింగ్‌ చేసి న్యాయం చేస్తామన్నా పట్టించుకోవడం లేదన్నారు. యువతి ఫిర్యాదు చేసినట్లయితే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. 


logo