శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Jan 28, 2020 , 02:19:04

రాజ్‌భవన్‌లో విజయసారథికి సన్మానం

రాజ్‌భవన్‌లో విజయసారథికి సన్మానం


కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన శ్రీభాష్యం విజయసారథిని ఆదివారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ తమిళసై, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందులో శ్రీభాష్యం విజయసారథిని సన్మానించారు. ఆయన సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి వినోద్‌కుమార్‌ సతీమణి డాక్టర్‌ బోయినపల్లి మాధవి, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo