శనివారం 06 జూన్ 2020
Karimnagar - Jan 27, 2020 ,

నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు

నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు
  • నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఆదివారం రెండో రోజు నేత్రపర్వంగా కొనసాగాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా వేద మంత్రోచ్ఛరణ మధ్య అర్చకులు స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారికి విశేషాలంకరణ చేశారు. ఉదయం ఆరాధన, ప్రాబోధకి, దివ్యప్రబంధ పారాయణం, సహస్ర దీపాలాంకరణ, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, తీర్థప్రసాద గోష్ఠి జరిపారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

భారీగా తరలి వచ్చిన భక్తులు

రెండో రోజు ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన వారితో క్యూ లైన్లు నిండిపోయాయి. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు భక్తులకు అవసరమైన సేవలందించేలా పర్యవేక్షిస్తున్నారు.


logo