గురువారం 28 మే 2020
Karimnagar - Jan 26, 2020 , 04:34:02

గులాబీ జయభేరి‘మున్సిపల్‌' ఫలితాల్లో ‘కారు’ దుమారం

 గులాబీ జయభేరి‘మున్సిపల్‌' ఫలితాల్లో ‘కారు’ దుమారం
  • - జిల్లాలోని నాలుగు బల్దియాలపై టీఆర్‌ఎస్‌ జెండా
  • - మొత్తం 86 వార్డు స్థానాలకు 63 కైవసం n ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతు
  • - సింగిల్‌ డిజిట్‌ దాటని కాంగ్రెస్‌, బీజేపీ n ఏడేసి వార్డులకే పరిమితం
  • - 9 వార్డుల్లో స్వతంత్రుల సత్తా
  • - అన్నీతామై చక్రం తిప్పిన మంత్రులు ఈటల, గంగుల, ఎమ్మెల్యే సుంకె
  • - ఆనందోత్సాహాల్లో శ్రేణులు

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జయభేరి మోగించింది. హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి బల్దియాల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది. మొత్తం 86 వార్డులకు గానూ 63 స్థానాలను కైవసం చేసుకొని, నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేసింది. కాంగ్రెస్‌, బీజేపీ సింగిల్‌ డిజిట్లకే పరిమితం కాగా, 9 వార్డుల్లో స్వతంత్రుల సత్తా సాగింది. మొత్తానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలే అధికార పార్టీని విజయతీరాలకు చేర్చగా, గెలుపులో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నీతామై నడపడంతో టీఆర్‌ఎస్‌ సుస్పష్టమైన మెజారిటీ సాధించింది.        - కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో గులాబీ జైత్రయాత్ర కొనసాగింది. నాలుగు మున్సిపాలిటీలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో అధికార పార్టీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 86 వార్డులకు గానూ హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో రెండు వార్డులను ఇంతకు ముందే టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ నెల 22న 84 వార్డులకు ఎన్నికలు జరగగా, ప్రతి మున్సిపాలిటీలోనూ చైర్మన్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీని టీఆర్‌ఎస్‌ సాధించింది.

63 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయం 

హుజూరాబాద్‌లో 30, జమ్మికుంటలో 30, చొప్పదండిలో 14, కొత్తపల్లిలో 12 వార్డులు కాగా, మొత్తంగా జిల్లాలో 86 వార్డులు ఉన్నాయి. హుజూరాబాద్‌లోని 2వ, 28వ వార్డులు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 84 వార్డుల్లో పోలింగ్‌ నిర్వహించారు. వీటిలో 63 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్‌ 7 వార్డుల్లో, బీజేపీ అభ్యర్థులు 7 వార్డుల్లో, ఇతరులు (ఏఐఎఫ్‌బీ, స్వతంత్రులను కలుపుకొని) 9 స్థానాల్లో విజయం సాధించారు.

ప్రతి మున్సిపాలిటీలోనూ స్పష్టమైన మెజార్టీ

నాలుగు మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకునేందుకు స్పష్టమైన మెజార్టీ సీట్లను దక్కించుకుంది. హుజూరాబాద్‌లో 30 వార్డులకు 21 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. జమ్మికుంటలో 30 వార్డులకు 22 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. చొప్పదండిలో 14 వార్డులకు గాను 9 వార్డులను కైవసం చేసుకుంది. కొత్తపల్లిలో 12 వార్డుల్లో 11 వార్డులను గెలిచింది. 

టీఆర్‌ఎస్‌కు 48.87శాతం ఓట్లు

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం ఓట ర్లు 76,427 మంది ఉన్నా రు. 61,557 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలు గు బల్దియాల్లో 30,086 ఓట్లను (48.87 శాతం) టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుం ది. హుజూరాబాద్‌లో 24,179 ఓట్లకు, 19,946 ఓట్లు పోల్‌ కాగా, 9,194 ఓట్లు (46.09 శాతం), జమ్మికుంటలో 29,879 ఓట్లకు 23,571 ఓట్లు పోలవగా, 11,872 ఓట్లు (50.36శాతం), చొప్పదండిలో 12,704 ఓట్లకు 10,333 ఓట్లు పోలవగా, 4845 ఓట్లు (46.88శాతం), కొత్తపల్లిలో 9,665 ఓట్లకు 7707 ఓట్లు పోలవగా, 4,175 ఓట్ల(54.17శాతం)ను సాధించింది.logo