శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Jan 25, 2020 , 02:29:40

బ్రహ్మోత్సవం.. ఇది బ్రహ్మోత్సవం!

బ్రహ్మోత్సవం.. ఇది బ్రహ్మోత్సవం!కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ మార్కెట్‌రోడ్డులోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. అధ్యయనోత్సవంతో అంగరంగ వైభవంగా మొదలు కాబోతున్నాయి. పది రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇప్పటికే ప్రధాన దారులు, చౌరస్తాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. కూడళ్లలో వివిధ దేవతామూర్తుల కటౌట్లను కూడా పెట్టారు. ఇప్పటికే దేవాలయాన్ని పూర్తిస్థాయిలో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పరిసరాల్లో పూర్తిస్థాయిల్లో భారీగా పెడాల్స్‌ను వేశారు. దేవాలయం ప్రాంతంతోపాటు అటుగా వేళ్లే వీధుల్లోనూ లైటింగ్‌ను అమర్చారు. స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు. పార్కింగ్‌ సదుపాయాలు, ఉత్సవాల వీక్షణ, అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా బందోబస్తు సిద్ధం చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ రెండు రోజులుగా దగ్గరుండి మరి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు.

కార్యక్రమాలివే.. 

   25న (శనివారం) సాయంత్రం అధ్యయనోత్సవం, తొళక్కము ప్రబంధ పారాయణాలు, తీర్థప్రసాద గోష్టి
  26న ఆరాధన, ప్రాబోధకి, దివ్యప్రబంధ పారాయణం, సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం
   27న పరమపదోత్సవం
  28న ఆరాధన, ప్రాబోధకి, రక్షాబంధనం, అంకురార్పణ, పుట్టమన్ను తేవడం, సాయంత్రం 6 గంటల నుంచి శేష వాహన సేవ
   29న యాగశాల ప్రవేశం, ద్వారతోరణ పూజ, అగ్ని ప్రతిష్ట, తీర్థ గోష్టి, ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనం, సాయంత్రం 6 గంటల నుంచి భేరిపూజ, చంద్రప్రభ వాహనం
   30న ఉదయం ఆరాధన, సేవా కాలం, శాంతి పాఠం, చతుస్థానార్చన, పరివార హోమం, మూలమంత్ర హవనం, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థప్రసాద గోష్టి, కల్ప వృక్షవాహనం, సాయంత్రం 3.30 లకు అశ్వ వాహనం, గజ వాహనాలపై ఎదుర్కోలు ఉత్సవం
    31న ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 7.30 గంటలకు తిరుప్పావడ సేవ, 8 గంటల నుంచి ఆరాధన, చతుస్థానార్చన, యాగశాలలో విశేష హోమం, ఉదయం 10.30 నుచి శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణుల కల్యాణ మహోత్సవం, తదీయారాధన, అన్నదానం, సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణ పరివార గరుడ వాహన సేవ, హోమం, పూర్ణాహుతి, బలిహరణ, తీర్థగోష్టి, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ
   ఫిబ్రవరి 1న ఆరాధన, సేవాకాలం, మూలమంత్ర హవనం, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థగోష్టి, 8 గంటలకు హనుమత్‌ వాహనం, సాయంత్రం మూలమంత్ర హవనం, పూర్ణాహుతి, తీర్థగోష్టి సాయంత్రం 6 గంటలకు సింహ వాహనం
   2న ఆరాధన, సేవా కాలం, శాంతి పాఠం, చతుస్థానార్చన, మూలమంత్ర హవనం, పరివార హోమం, మహా పూర్ణాహుతి, చక్ర తీర్థోత్సవం, వసంతోత్సవం, బలిహరణం, తీర్థగోష్టి, సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, పుష్పయాగం, ద్వాదశరాధన, సప్తవర్ణములు, ధ్వజ అవరోహణ, ఏకాంతసేవ, పండిత సన్మానం, మహదాశీర్వచనం
   3న సాయంత్రం 3 గంటలకు మార్క్‌ఫెడ్‌ నుంచి పుర వీధుల్లో శోభాయాత్రlogo