బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 25, 2020 , 02:27:20

శైశిర నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

 శైశిర నవరాత్రి మహోత్సవాలు ప్రారంభంకరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ మండలం నగునూర్‌ దుర్గాభవానీ దేవాలయంలో శుక్రవారం వేద పండితుడు పురాణం మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో శైశిర నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రోత్సవాల్లో భాగంగా ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి విశేష ద్రవ్యాలతో మహాభిషేకం, ఫలపంచామృతాభిషేకం, విశేష హారతులు, పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ కమిటీ బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, ముక్క ప్రభాకర్‌, నీరుమల్ల తిరుపతి, శానగొండ మధుసూదన్‌, సుహాసిని సేవాదల్‌ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.  కాగా, శైశిర నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 8.03 గంటలకు కలశస్థాపన, 9 గంటలకు, సాయంత్రం 6 గంటలకు చతుష్షష్ఠ ప్రచార పూజ, విశేష  హారతి, ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ బాధ్యుడు వంగల లక్ష్మణ్‌ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.


logo