గురువారం 04 జూన్ 2020
Karimnagar - Jan 24, 2020 , 02:01:29

ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌

ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌
  • - రైతు భూ సర్వే కోసం రూ.10 వేల లంచం డిమాండ్‌ n ఇల్లందకుంట మండలంలో విధులు
  • - జమ్మికుంటలో రూ.7 వేలు తీసుకుంటుండగా పట్టివేత
  • - కేసు నమోదు.. ఏసీబీ కోర్టుకు తరలింపు
  • - వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ భద్రయ్య


జమ్మికుంట: భూసర్వే కోసం లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్‌ పట్టబడ్డాడు. ఈ సంఘటన జమ్మికుంటలో కలకలం రేపింది. ఇల్లందకుంట మండలంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న ఎస్‌కే మోబిన్‌ భూమి సర్వే చేసేందుకు లంచం డిమాండ్‌ చేశారు. రైతు కొడుకు నుంచి రూ.7వేలు తీసుకుంటూ గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. కేసు నమోదు చేసి, ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేగుర్ల మల్లయ్యది ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామం.  ఆయనకు 35 గుంటల వ్యవసాయ భూమి కలదు. కానీ మోఖా మీద  భూమి తక్కువగా ఉంది. ఇదే విషయంపై పలుసార్లు తాసిల్దార్‌, వీర్వోలను  కలిశాడు. సర్వే చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఇదే క్రమంలో మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భూసర్వే విషయం కొడుకు రా జుతో   చెప్పాడు. దీంతో భూ కొలతల కోసం సర్వేయర్‌ ఎస్‌కే మోబిన్‌ను రాజు కలిశాడు. సర్వే కోసం రూ.10వేలు కావాలని సర్వేయర్‌ లంచం డిమాండ్‌ చే శాడు. బాధితుడు రాజు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తర్వాత లంచం ఇచ్చేందుకు ఒప్పుకు న్న రాజు అదే రోజు మీ సేవా కేంద్రంలో భూకొలతల కోసం ఫీజు చెల్లించాడు. గురువారం సర్వేయర్‌కు లం చం ఇచ్చేందుకు రాజు సిద్ధమయ్యాడు. రూ.10వేలు తీసుకుని సర్వేయర్‌ వద్దకు వెళ్లాడు. అయితే సర్వేయర్‌ ఎస్‌కే మోబిన్‌ జమ్మికుంట బస్టాండ్‌ వద్ద ఉన్నానని చెప్పాడు. సర్వేయర్‌ను కలిసిన రాజు, రూ.10వేలు ఇ వ్వబోయాడు. రూ. 3వేలు కొలతల తర్వాత తీసుకుంటాననీ, ఇప్పుడు రూ.7వేలు మాత్రమే చాలనీ సర్వేయర్‌ తీసుకున్నాడు. నగదు తీసుకున్న వెంటనే పట్టుకున్నట్లు ఏసీబీ అధికారి చెప్పారు.  సర్వేయర్‌ వద్ద రూ.7వేల నగదు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు తెలిపారు. బాధితుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి, ఏసీబీ కోర్టుకు నిందితుడిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. తర్వాత ప్రభుత్వ ఉర్ధూ మీడియం పాఠశాల ఎదురుగా ఉన్న సర్వేయర్‌ నివాసం ఉంటన్న ఇంటికి ఏసీబీ అధికారుల బృందం వెళ్లారు. సోదాలు నిర్వహించారు. విచారణ చేశారు. కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక్కడ ఏసీబీ డీ ఎస్పీ భద్రయ్యతో పాటు సీఐలు వేణుగోపాల్‌, సంజీ వ్‌, రాము, సిబ్బంది ఉన్నారు.


logo