బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 22, 2020 , 03:57:12

మున్సిపోల్స్

మున్సిపోల్స్
  • - ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఆరుగురు చొప్పున సిబ్బందిని కేటాయించారు. అన్ని కేంద్రాల్లో తాగు నీరు, మూత్రశాలలు, విద్యుత్ సదుపాయాలు కల్పించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ఎంపీడీఓలను సంక్షేమ అధికారులుగా నియమించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రతి పట్టణానికి ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఇన్ నియమించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలపై గట్టి నిఘా పెట్టారు. ఇక్కడ మైక్రో అబ్జర్వర్లను అదనంగా నియమించారు.

84 వార్డుల్లో 382 మంది

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 86 వార్డులు ఉండగా మొత్తం 78,187 మంది ఓటర్లు ఉన్నారు. వీటి పరిధిలో హుజూరాబాద్ 2 వార్డులు ఏకగ్రీవం కావడంతో ఇక్కడి 1760 మంది ఓటర్లకు ఎన్నికలు ఉండవు. మిగిలిన 84 వార్డుల్లో 145 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 76,427 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 40 లొకేషన్లలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 382 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 27 అతి సమస్యాత్మక కేంద్రాలుగా, 36 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి ఒక్కో లొకేషన్ ఒక్కో మైక్రోఅబ్జర్వర్ చొప్పున 27 మందిని నియమించారు. 13 రూట్లు, 10 జోన్లుగా విడదీసి 28 జీపులు, మరో 28 బస్సులను ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారు. 174 మంది ప్రిసైడింగ్, మరో 174 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను, 521 మంది ఇతర ప్రిసైడింగ్ ఆఫీసర్ల చొప్పున ఎన్నికల నిర్వహణకు మొత్తం 869 మందిని నియమించారు. వీరు కాకుండా 34 మంది రిటర్నింగ్, మరో 34 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. ఎన్నికల రోజు కూడా నిఘా పెట్టేందుకు 8 ఎఫ్ 6 ఎస్ టీమ్ పనిచేస్తున్నాయి. ఒక్కో పట్టణానికి ఒక్కో సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులను కూడా నియమించారు.

కొత్తపల్లిలో..

కొత్తపల్లి మున్సిపాలిటీలో 9,665 మంది ఓటర్లు ఉన్నారు. 12 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ మూడు లొకేషన్లలో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా మూడింటిని గుర్తించి ఇక్కడ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక జోన్ విడదీసి 2 రూట్లను కేటాయించారు. ఇక్కడ 5 జీపులు, 2 బస్సులను వినియోగిస్తున్నారు. 18 మంది పీఓలు, మరో 18 మంది ఏపీఓలు, 54 మంది ఇతర పీఓలుల చొప్పున మొత్తం 90 మంది ఎన్నికల సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు. అలాగే నలుగురు రిటర్నింగ్, మరో నలుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. 2 ఎఫ్ టీ మ్ ఇక్కడ పరిశీలించనున్నాయి. ముగ్గురు మైక్రో అబ్జర్వర్లు, మరో ముగ్గురు వీడియో గ్రాఫర్లు అదనంగా పనిచేస్తున్నారు.

చొప్పదండిలో..

చొప్పదండి మున్సిపాలిటీల్లో  12,704 మంది ఓటర్లు ఉన్నారు. 14 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 62 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 5 లొకేషన్లలో 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 లొకేషన్లలో 4 అతిసమస్యాత్మక, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంపిణీ, రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక జోన్ విడదీసి 3 రూట్లలో 5 జీపులు, 6 బస్సులను వాడుతున్నారు. 29 మంది పీఓలు, మరో 29 మంది ఏపీఓలు, 85 మంది ఓపీఓల చొప్పున మొత్తం 143 మంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు. వీరు కాకుండా ఆరుగురు రిటర్నింగ్, మరో ఆరుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. 2 ఎఫ్ 4 ఎస్ టీమ్ ఒక ఏఈఓ పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తున్నారు.

జమ్మికుంటలో..

జమ్మికుంట మున్సిపాలిటీలో 29,879 మంది ఓటర్లు ఉన్నారు. 30 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 137 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 14 లొకేషన్లలో 60 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11 లొకేషన్లలో 18 అతిసమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంపిణీ, రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. 4 జోన్లుగా విడదీసి 4 రూట్లలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఇందుకు 9 జీపులు, 10 బస్సులను వినియోగిస్తున్నారు. ఇక్కడ 72 మంది పీఓలు, మరో 72 మంది ఏపీఓలు, 216 మంది ఓపీఓల చొప్పున 360 మందిని ఎన్నికల నిర్వహణకు వినియోగిస్తున్నారు. అలాగే 12 మంది రిటర్నింగ్, మరో 12 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 2 ఎఫ్ మరో 2 ఎస్ టీంలు పనిచేస్తున్నాయి. ఒక ఏఈఓ పరిశీలిస్తారు. 11 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తున్నారు.

హుజూరాబాద్

హుజూరాబాద్ మున్సిపాలిటీలో 25,939 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 30 వార్డులు ఉండగా 2 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 24,179 మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా, 131 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 18 లొకేషన్లలో 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 లొకేషన్లలో 11 అతిసమస్యాత్మక, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పంపిణీ, రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. 4 జోన్లు, 4 రూట్లలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఇందుకు 9 జీపులు, 10 బస్సులను వినియోగించారు. 55 మంది పీఓలు, మరో 55 మంది ఏపీఓలు, 166 మంది ఓపీఓల చొప్పున 276 మంది సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు. వీరు కాకుండా 12 మంది రిటర్నింగ్, మరో 12 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. 2 ఎఫ్ టీంలు, ఒక ఏఈఓ పర్యవేక్షిస్తారు. 11 మంది మైక్రో అబ్జర్వర్లు ఇక్కడ పనిచేస్తున్నారు.

గట్టి పోలీసు బందోబస్తు..

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. సీపీ కమలాసన్ పర్యవేక్షణలో రెండు పట్టణాలకు ఒకరి చొప్పున ఇద్దరు డీసీపీలు, ప్రతి పట్టణానికి ఒకరి చొప్పున నలుగురు ఏసీపీలు, నలుగురు సీఐలు, మరో నలుగురు ఎస్ సంబంధిత పోలీసు డివిజన్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల ఏఎస్ హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులను ఎన్నికల బందో బస్తుకు వినియోగిస్తున్నారు. మొత్తానికి 800 మంది పోలీసు ఫోర్స్ ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తోంది.

అన్ని మున్సిపాలిటీల్లో 144 సెక్షన్

నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 144 సెక్షన్ విధించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాయి. డబ్బులు నేరుగా ఇవ్వకుండా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్నట్లు గమనిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

ఓటరు కార్డుకు బదులు..

మున్సిపల్ ఎన్నికల్లో గుర్తింపు కార్డు లేని ఓటర్లు 18 రకాల కార్డులను చూపి ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది.
ఇందులో.. ఆధార్ పాస్ డ్రైవింగ్ లైసెన్స్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు/టీఎస్ తపాలా కార్యాలయాలు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్
ఆదాయపన్ను గుర్తింపు కార్డు (పాన్ కార్డు)
జాతీయ జనాభా రిజిష్టర్ (ఎన్ పథకం అంతర్గతంగా ఆర్ వారు జారీ చేసిన స్మార్ కార్డు.
ఎలక్షన్ నోటిఫికేషన్ జారి చేసిన తేదీ లేదా అంతకు పూర్వమే జారీ చేసిన ఉపాధి హామీ జాబ్ కార్డు..
ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయబడిన తేదీకి లేదా అంతకు పూర్వమే జారీ చేయబడిన కార్మిక మంత్రిత్వ శాఖ పథకం అంతర్గతంగా జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు.

ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయబడిన తేదీ లేదా అంతకు పూర్వమే జారీ చేయబడిన ఫొటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్/ మాజీ సైనికుల పింఛన్ బుక్/ పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు (మాజీ సైనికుల భార్యలు ఆదారపడిన సర్టిఫికెట్) వృద్ధాప్య, వితంతు పింఛన్ ఆర్డర్లు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారికి సంబంధిత సెక్రటేరియట్ జారీ చేసిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు.
ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయబడిన తేదీ లేదా అంతకు పూర్వం జారీ చేయబడిన ఫొటోతో కూడిన రేషన్ కార్డు.
ఆధీకృత అధికారి జారీ చేసిన ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికెట్.
ఫొటోతో కూడిన స్వతంత్ర సమర యోధుల గుర్తింపు కార్డు.
ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయబడిన తేదీ లేదా అంతకు ముందు జారీ చేసిన ఆయధ లైసెన్స్.
ఎలక్షన్ నోటిఫికేషన్ జారీకి లేదా అంతకు ముందు ఉన్న ఫొటోతో కూడిన దివ్యాంగుల సర్టిఫికెట్..
ఎంపీలకు వారికి సంబంధించిన సెక్రటేరియట్ జారీ చేసిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు.
ఎలక్షన్ నోటిఫికేషన్ జారీకి ముందు లేదా ఆ తర్వాత జారీ చేసిన ఫొటోతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం.logo