శనివారం 06 జూన్ 2020
Karimnagar - Jan 22, 2020 , 03:56:43

అభివృద్ధి కోసం ఆశీర్వదించండి..

అభివృద్ధి కోసం ఆశీర్వదించండి..


కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : డివిజన్ అభివృద్ధి కోసం నగరపాలక సంస్థ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి కార్పొరేటర్ గెలిపించాలని 56వ డివిజన్ టీఆర్ అభ్యర్థి వంగపల్లి రాజేందర్ కోరారు. మంగళవారం భాగ్యనగర్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ సమస్యలపై తనకు అవగాహన ఉందనీ, వాటిని ఎలా పరిష్కరించాలో కూడా తెలుసన్నారు. తనకు కార్పొరేటర్ అవకాశం కల్పిస్తే డివిజన్ ఎలాంటి సమస్యలూ లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే టీఆర్ పాలనలో అభివృద్ధి జరిగిందనీ, దానిని మరింత వేగవంతం చేసే అవకాశం కల్పించాలన్నారు. ఈ డివిజన్ వేసవిలో ఎదురవుతున్న నీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. డివిజన్ అభివృద్ధితోపాటు ప్రజలకు సేవ చేయాలనే మీ ముందుకు వచ్చాననీ, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ ప్రభుత్వం నగరంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని చెప్పారు.

డివిజన్ అభివృద్ధికి టీఆర్ ముందు ఉన్న ప్రభుత్వాలు పెద్దగా నిధులు ఇవ్వలేదనీ, తనను గెలిపిస్తే అత్యధిక నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో ముందుంచుతానని పేర్కొన్నారు. నగరంలో ప్రధాన రహదారులు అభివృద్ధికి నోచుకున్నాయనీ, వీధుల్లో దెబ్బతిన్న రోడ్లను ఈ సారి తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపుతానని చెప్పారు. నగరాన్ని సుందరంగా మార్చేందుకు టీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదన్నారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. టీఆర్ పార్టీ గెలిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందనీ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాననీ, కార్పొరేటర్ అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో ఆయన వెంట మాజీ కార్పొరేటర్లు అజిత్ సదానందాచారి, నాయకులు ఆకారపు భాస్కర్ గోలి రవి, రవీందర్, పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు.logo