సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Jan 22, 2020 , 03:54:11

అందుబాటులో ఉండి సేవలందిస్తా

అందుబాటులో ఉండి సేవలందిస్తాకార్పొరేషన్, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు వేసి ఆశీర్వదించి తనను గెలిపిస్తే డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని 33వ డివిజన్ టీఆర్ అభ్యర్థి వై సునీల్ అన్నారు. మంగళవారం 33వ డివిజన్ పరిధిలోని భగత్ పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. గత ఐదేండ్లలో డివిజన్ కార్పొరేటర్ చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేశారు. మరోసారి అవకాశం ఇస్తే డివిజన్ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు స్మార్ట్ డివిజన్ మార్చుతానన్నారు. ఇప్పటికే డివిజన్ స్మార్ట్ పథకం కింద చేపడుతున్న రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన మిగిలిన పనులను కూడ తనను గెలిపించిన అనంతరం ప్రారంభించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. వంద శాతం సీసీ రోడ్లను నిర్మిస్తామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐదేండ్ల టీఆర్ పాలనలో అభివృద్ధి వేగవంతమైందన్నారు.

గత ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సారి కూడ అత్యధిక మెజార్టీతో తిరిగి గెలిపించాలని కోరారు. నగరాభివృద్ధికి మంత్రి గంగుల కమలాకర్ అత్యధికంగా నిధులు తీసుకువస్తున్నారనీ, ఆ మేరకు డివిజన్ కూడ భారీగా నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతామని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తానన్నారు. ప్రజలు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. అలాగే 53వ డివిజన్ టీఆర్ అభ్యర్థి తుల శ్రీదేవి తరఫున టీఆర్ నాయకుడు వై సునీల్ ప్రచారం చేశారు. కార్యక్రమంలో టీఆర్ నాయకులు అంజన్ వెంకట్రావు, వినోద్, అనిల్, విజయ్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.


logo