గురువారం 04 జూన్ 2020
Karimnagar - Jan 17, 2020 , 01:14:57

సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
  • - టీఆర్‌ఎస్‌తోనే పట్టణాల అభివృద్ధి
  • - మంత్రి ఈటల రాజేందర్‌
  • -కారు గుర్తుకు ఓటేసి అండగా ఉండాలని విజ్ఞప్తి
  • -హుజూరాబాద్‌లోని పలు వార్డుల్లో ప్రచారం
  • - పాల్గొన్న ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

హుజూరాబాద్‌. నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. గురువారం మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 5,17, 20,25.27, తదితర వార్డుల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందించింది కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్య ర్థులు గెలిచినా.. వారు ఎలాంటి అభివృద్ధి చేయలేరన్నారు.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ఆ వార్డుల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రజలు ఓట్లు వేస్తే వచ్చే పదవిని దుర్వినియోగం చేయవద్దనీ, వారి సేవ కోసం ఉపయోగించాలని అభ్యర్థులకు సూచించారు. ప్రజలు మెచ్చేలా నాయకులు పనిచేయాలన్నారు. ఐదో వార్డులో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అపరాజ ముత్యంరాజుకు ఒడ్డెర  సంఘం నాయకులు మంత్రి సమక్షంలో మద్దతు పలికారు.  ఇక్కడ నాయకులు బండ శ్రీనివాస్‌, గోపు కొమురారెడ్డి,  కొత్త అశోక్‌రెడ్డి, గందె శ్రీనివాస్‌, ఇరుమల్ల  సురేందర్‌రెడ్డి, గందె సాయి, జానీ, భూం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


logo