బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 14, 2020 , 03:57:09

పోలింగ్‌ స్టేషన్లలో అన్ని సదుపాయాలు

పోలింగ్‌ స్టేషన్లలో అన్ని సదుపాయాలు


(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఎన్నికల నోడల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, తాసిల్దార్లు, ఎంపీడీఓలతో ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పోలింగ్‌ స్టేషన్లలో లైటింగ్‌, టాయిలెట్స్‌, ర్యాంపులు, తాగునీటి వసతి తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్లలో ర్యాంపులు లేవనీ, వెంటనే నిర్మించాలన్నారు. పోలింగ్‌ మెటీరియల్‌ను చెక్‌లిస్టు ప్రకారం సరి చూసుకోవాలన్నారు. ఎన్నికల సామగ్రిని ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎంసీసీ కమిటీలో పోలీసులతో సమన్వయం చేసుకోవాలని తాసిల్దార్లను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పీఓలు, ఏపీఓలతో పోలింగ్‌స్టేషన్‌లో వసతుల కల్పన, భోజన ఏర్పాట్లు చూసుకోవాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ఎన్నికలు సమన్వయంతో సమర్థంగా నిర్వహించేందుకు నాలుగు మున్సిపాలిటీలకు నలుగురు జిల్లా అధికారులను కోఆర్డినేటర్లుగా నియమించినట్లు తెలిపారు. హుజూరాబాద్‌ మున్సిపాలిటీకి జిల్లా పరిషత్‌ సీఈఓ, జమ్మికుంట మున్సిపాలిటీకి మెప్మా పీడీ, చొప్పదండికి డీఆర్‌డీఓ, కొత్తపల్లికి పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ను నియమించినట్లు తెలిపారు. మున్సిపల్‌ కోఆర్డినేటర్లు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలీస్‌, కౌంటింగ్‌ రిపోర్టులను వెంట వెంటనే పంపించేందుకు కృషి చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందికి ఈనెల 17, 18 తేదీల్లో రెండోసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈఓ వెంకటమాధవరావు, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, మెప్మా పీడీ పవన్‌కుమార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం నవీన్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్‌, ఎల్‌డీఎం రమేశ్‌కుమార్‌, కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఆర్డీఓలు ఆనంద్‌కుమార్‌, పీ బెన్‌షాలోం, ఏసీపీ, ఎంపీడీఓలు, తాసిల్దార్లు పాల్గొన్నారు.logo