బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 14, 2020 , 03:56:27

21 నామినేషన్ల ఉపసంహరణ

 21 నామినేషన్ల ఉపసంహరణ


హుజూరాబాద్‌ టౌన్‌/ జమ్మికుంట/ కరీంనగర్‌రూరల్‌/ చొప్పదండి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి పట్టణాల్లో 21 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హుజూరాబాద్‌లో 192 మంది అభ్యర్థులు కాగా సోమవారం మరో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని ఎన్నికల అధికారి, కమిషనర్‌ ఈసంపెల్లి జోన తెలిపారు. ఇక 30 వార్డులకు 187 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్పారు. 2వ వార్డు నుంచి ఇద్దరు, 9వ వార్డు నుంచి ఒకరు, 26వ వార్డు నుంచి ఒకరు, 30వ వార్డు నుంచి ఒకరు, 4వ వార్డు నుంచి ఒకరు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. జమ్మికుంట పట్టణంలో నలుగురు పోటీ నుంచి తప్పుకున్నారని మున్సిపల్‌ కమిషనర్‌, ఎన్నికల అధికారి అనిసూర్‌ రషీద్‌ తెలిపారు. 12వ వార్డులో ఒకరు, 15వ వార్డులో ఇద్దరు, 25వ వార్డులో ఒకరు నామినేషన్లను విత్‌ డ్రా చేసుకున్నారు. పట్టణంలో 30 వార్డులకు గానూ ఇంకా పోటీలో 217మంది అభ్యర్థులు ఉన్నారని అధికారి చెప్పారు. చొప్పదండిలో 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. ఇక 14 వార్డులకు 99 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు చెప్పారు. కొత్తపల్లి పరిధిలోని 1 వార్డు నుండి ఒకరు నామినేషన్‌ ఉపసంహరించున్నారనీ, ప్రస్తుతం 12 వార్డులకు పోటీలో 118 నామినేష్లన్లు ఉన్నట్లు తెలిపారు.


logo