గురువారం 04 జూన్ 2020
Karimnagar - Jan 12, 2020 , 04:43:23

కలెక్టర్‌, జిల్లా అధికారులకు..

కలెక్టర్‌, జిల్లా అధికారులకు..

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ/ హుజూరాబాద్‌ రూరల్‌:  కలెక్టర్‌, జిల్లా అధికారులకు డెమొక్రసీ అవార్డులు దక్కాయి. జిల్లా కలెక్టర్‌ కే  శశాంక గతంలో పని చేసిన జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో జిల్లా మండల పరిషత్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకుగానూ శనివారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర డెమొక్రసీ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తారాగతి బరదారి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే,  గత పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో సమర్థ్ధవంతంగా సేవలందించిన పలువురు అధికారులకు కూడా ఈ అవార్డు దక్కింది. వీరిలో జడ్పీ సీఈవో డీ వెంకట మాధవరావు, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సీ రాజేంద్రప్రసాద్‌, హుజూరాబాద్‌ ఎంపీడీవో జీ కిషన్‌ప్రసాద్‌, తిమ్మాపూర్‌ సీఐగా పనిచేసి వెళ్లిన టీ కరుణాకర్‌రావుకు ఈ అవార్డులు వచ్చాయి. గవర్నర్‌ తమిళిసై, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా అధికారులు  అవార్డులు అందుకున్నారు. వారిని పలువురు అభినందించారు.


logo