బుధవారం 27 మే 2020
Karimnagar - Jan 12, 2020 , 04:42:54

పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారుకార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ/కరీంనగర్‌ క్రైం : తాను చివరి వరకూ టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటాననీ, పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ ఏది చెప్తే తాను అది చేస్తానని మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ తెలిపారు. తప్పుడు ప్రచారంపై పోలీస్‌సేష్టన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే తమను బద్‌నాం చేసేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. విపక్షాలు తనపై కుట్రలు పన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడం వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాయనీ, తనపై విద్వేషంతోనే పార్టీ మారుతున్నానన్న విష ప్రచారాన్ని సాగిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీలో విభేదాలు సృష్టించేందుకు ఇలాంటి ప్రచారాలు సాగిస్తున్నారనీ, తాను తెలంగాణ ఉద్యమం నుంచి సీఎం కేసీఆర్‌ చేప్పిన బాటలోనే నడుస్తున్నానని తెలిపారు. ఇక ముందు కూడా అలాగే నడుచుకుంటానని స్పష్టం చేశారు.


logo