బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 12, 2020 , 04:42:21

ఘనంగా గురునానక్‌ జయంతి

ఘనంగా గురునానక్‌ జయంతి


కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: గురునానక్‌ దేవ్‌జీ 550వ జన్మదినం సందర్భంగా కరీంనగర్‌లో సిక్కు మతస్థులు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. స్థానిక సర్కస్‌గ్రౌండ్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాందేడ్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన గురుగ్రంథ్‌సాహెబ్‌కు పూజలు నిర్వహించగా, మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రిని సిక్కు సోదరులు ఘనంగా సత్కరించారు. సాయంత్రం సర్కస్‌గ్రౌండ్‌ నుంచి సిక్‌వాడీలోని గురుద్వారా వరకు పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో సిక్కులు సంప్రదాయ పద్ధతిలో కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఎప్పుడు లేని విధంగా భారీ ఎత్తున చేపట్టిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కత్తులు, ఇతర ఆయుధాలతో చేపట్టిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ సభ్యులు జస్బీర్‌సింగ్‌, కిర్పాల్‌సింగ్‌, బల్బీర్‌సింగ్‌, సిక్కు మతస్థులు, తదితరులు పాల్గొన్నారు.


logo