బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 12, 2020 , 04:41:48

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం


సైదాపూర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ. 4 లక్షల 16 వేల ఐదు వందలు ఆర్థిక సాయం మంజూరైంది. హుజూరాబాద్‌ మండలం సింగాపురంలోని ఎమ్మెల్యే నివాసంలో బాధితులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ సారబుడ్ల రాజిరెడ్డి,  సర్పంచులు చంద శ్రీనివాస్‌, కాయిత రాములు, కొత్త రాజిరెడ్డి, ఆవునూరి పాపయ్య, అబ్బిడి పద్మ, చింత లత,   ఎంపీటీసీ గాజర్ల భాగ్య,  మాజీ జడ్పీటీసీ బిల్ల వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ మునిగంటి స్వామి, మాజీ సర్పంచులు పూదరి ప్రభాకర్‌, సర్జన ఎల్లయ్య,  చిక్కుల సంపత్‌, నాయకులు ఎల్కపల్లి రవీందర్‌, పోతిరెడ్డి హరీష్‌రావు, పరుకాల నారాయణ, కుమారస్వామి, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo