శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Jan 09, 2020 , 18:02:53

‘ఆర్టీసీ’ ఆత్మీయ సమ్మేళనం

‘ఆర్టీసీ’ ఆత్మీయ సమ్మేళనం

జూలపల్లి : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఆర్టీసీ-2 డిపో ఉద్యోగులు పెద్దాపూర్‌లోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సల్లంగుండాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమ్మెను విరమింపజేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమను ఉద్యోగులుగా గుర్తించిన దేవుడు కేసీఆరేనని కొనియాడారు. ఆర్టీసీ సంస్థ మనుగడకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టి, సంస్థను బతికించుకుంటామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఆటలు, పాటల పోటీలు ఏర్పాటు చేసుకుని, నృత్యాలు చేస్తూ సంబురంగా గడిపారు. డిపో మేనేజర్‌ మల్లేశం, సీఐ జ్యోత్స్న, సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌, సూపర్‌వైజర్లు, ఎంప్లాయీస్‌ వెల్పేర్‌ కౌన్సిల్‌ సభ్యులు సత్తయ్య, సవితారాణి, లక్ష్మి, శ్రీనివాస్‌, సమ్మయ్య, మెకానిక్‌లు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


logo