శనివారం 30 మే 2020
Karimnagar - Jan 09, 2020 , 18:02:27

‘నేను నా ఊరి కోసం’ ప్రారంభం

‘నేను నా ఊరి కోసం’ ప్రారంభం

గంగాధర: ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో గ్రామస్తులను భాగస్వాములను చేసి గ్రామాలను మరింత అభివృద్ధి దిశలోకి తీసుకువెళ్లేలా ‘నేను నా ఊరి కోసం’ అనే వినూత్న కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ బుధవారం గంగాధర మండలంలోని నారాయణపూర్‌లో శ్రీకారం చుట్టారు. గ్రామంలో పుట్టి ఉన్నతంగా ఎదిగిన వాళ్లు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు, విదేశాల్లో ఉన్న ప్రవాసులు, ఉద్యోగులు, ఆర్థికంగా అభివృద్ది సాధించిన వాళ్లు తాము పుట్టిన ఊరి అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. తన పుట్టిన ఊరైన నారాయణపూర్‌ అభివృద్దికి తన వంతుగా రూ. లక్ష విరాళం ప్రకటించి, చెక్కును ఆ గ్రామ సర్పంచ్‌ నజీర్‌కు అందజేశారు.


logo