e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home కరీంనగర్ వినాయకా.. వీడ్కోలిక

వినాయకా.. వీడ్కోలిక

జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణేశ్‌ నిమజ్జన వేడుకలు
గణనాథుడికి పూజలు చేసిన మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై సునీల్‌రావు, కలెక్టర్‌ కర్ణన్‌,సీపీ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు

కమాన్‌చౌరస్తా/కొత్తపల్లి, సెప్టెంబర్‌ 19: జిల్లా వ్యాప్తంగా ఆదివారం గణేశ్‌ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో గణేశ్‌ విగ్రహాలను ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో భక్తుల నృత్యాలు, మహారాష్ట్ర, పూణే నుంచి తెప్పించిన ప్రత్యేక బ్యాండ్‌ ఆకట్టుకుంది. ఈ క్రమంలో నగరంలోని ఒకటో నంబర్‌ గణనాథుడి వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై సునీల్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టవర్‌ సర్కిల్‌లో ఒకటో నంబర్‌ గణపతికి స్వాగతం పలికి అర్చకులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో మంత్రి గంగుల, మేయర్‌ సునీల్‌ రావు, కలెక్టర్‌ కర్ణన్‌, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, ఉత్సవ కమిటీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఊట్కూరి రాధాకృష్ణ, కోమల్ల రాజేందర్‌ రెడ్డి, విజయ్‌కుమార్‌, ప్రదీప్‌కుమార్‌, శ్రీనివాస్‌, ప్రశాంత్‌, జశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాంగనర్‌లో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణీహరిశంకర్‌ ఆధ్వర్యంలో చింతకుంటకు తరలుతున్న గణనాథులకు మంత్రి గంగుల, మేయర్‌ సునీల్‌రావు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. చింతకుంట కెనాల్‌ వద్ద గణనాథులకు మంత్రి గంగుల కమలాకర్‌ పూజలు చేశారు. అంతకు ముందు మేయర్‌ వై సునీల్‌ రావు నగరంలోని పలు మండపాల వద్ద పూజల్లో పాల్గొన్నారు. చింతకుంట, కొత్తపల్లి చెరువు నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లను సీపీ సత్యనారాయణ, ఎస్‌ఐ ఎల్లాగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, తహసీల్దార్‌ చిల్ల శ్రీనివాస్‌, ఎంపీవో దొంత శ్రీనివాస్‌, చింతకుంట సర్పంచ్‌ మొగిళి మంజుల-సమ్మయ్య, ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్‌, పంచాయతీ కార్యదర్శి రేవంత్‌రెడ్డి, గట్టు శ్రీధర్‌, మారుతి, తీగల వెంకన్న తదితరులు పర్యవేక్షించారు.
అలరించిన సాంసృతిక ప్రదర్శనలు..
టవర్‌ సరిల్‌ వద్ద సీనియర్‌ కళాకారులు గోగుల ప్రసాద్‌ నిర్వహణలో సంగెం రాధాకృష్ణ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా టవర్‌ సర్కిల్‌కు వచ్చే భక్తులు డప్పు చప్పుళ్లకు నృత్యాలు చేస్తూ, స్వామి వారిని స్మరిస్తూ పులకరించిపోయారు.
ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్‌
నిమజ్జన ఏర్పాట్లు, నిమజ్జనం జరుగుతున్న తీరును సీపీ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. టవర్‌ సర్కిల్‌లో పూజలు చేసిన తర్వాత పోలీస్‌ అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. బందోబస్తు, వినాయకుల తరలింపును, శాంతిభద్రతల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ వేలం
వావిలాలపల్లిలోని గుండు హనుమాన్‌ ఆలయం వద్ద ప్రతిష్ఠించిన గణనాథుడి చేతిలో పెట్టిన లడ్డూను పెరుమాళ్ల ప్రశాంత్‌ రూ. 32,516కు దక్కించుకున్నారు. ఇక్కడ సంతోశ్‌ గౌడ్‌, సతీశ్‌ పటేల్‌, ఎడ్ల సాగర్‌ తదితరులు పాల్గొన్నారు. సూర్యనగర్‌ శుభం గార్డెన్‌ వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద లడ్డూను కర్ర వనిత-అశోక్‌ రెడ్డి దంపతులు రూ. 16వేలకు దక్కుంచుకున్నారు. 50వ డివిజన్‌ గణేశ్‌నగర్‌లో ప్రతిష్ఠించిన పెద్ద గణపతి వద్ద లడ్డూను కార్పొరేటర్‌ కొలిపాక అంజయ్య రూ. 11,116కు పొందారు. 8వ డివిజన్‌ కార్యాలయ సమీపంలో ప్రతిష్ఠించి గణనాథుడి వద్ద లడ్డూను చిల్ల మల్లేశ్‌ దంపతులు రూ. 6,316 దకించుకున్నారు.
హౌసింగ్‌బోర్డుకాలనీ, సెప్టెంబర్‌ 19: జ్యోతినగర్‌లోని శ్రీగణేశ్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం రూ. 43 వేలు పలికినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement