e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home కరీంనగర్ మోసం చేసిన ఈటలకు గుణపాఠం చెప్పండి

మోసం చేసిన ఈటలకు గుణపాఠం చెప్పండి

మోసం చేసిన ఈటలకు గుణపాఠం చెప్పండి

దేశద్రోహం చేస్తున్న బీజేపీలో చేరిండు
మంత్రి కొప్పుల ఈశ్వర్‌
జమ్మికుంట 29వ వార్డువాసులతో సమావేశం

జమ్మికుంట, జూలై18: పదవులన్నీ అనుభవించి పార్టీని మోసం చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఓటుతో బుద్ధిచెప్పాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హుజూరాబాద్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌కు అండగా నిలువాలని కోరా రు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని 23వ వార్డు కౌన్సిలర్‌ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో స్థానిక రాధాకృష్ణ మినీ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు. అంతకుముందు పట్టణానికి చేరుకున్న మంత్రికి తెలంగాణచౌక్‌ వద్ద పార్టీ నాయకులు ఘనస్వాగ తం పలికారు. మంత్రి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇక్కడ ఇటీవల యూత్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన యువకులు మంత్రిని కలిశారు. ఈటల ఓటమి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని ప్రకటించారు. అనంతరం వారు బైక్‌ర్యాలీ నిర్వహించగా మంత్రి గులాబీ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడినుంచి డప్పుచప్పుళ్ల మధ్య సమావేశ ప్రాంగణానికి చేరుకుని మాట్లాడారు.

2003లో ఓ అనామకుడిగా పార్టీలో చేరిన ఈటలను కేసీఆర్‌ ఎమ్మెల్యేగా గెలిపించారని చె ప్పారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసా ర్లు మంత్రిగా అవకాశం కల్పించారన్నారు. తమ్ముడి లా చూసుకున్న కేసీఆర్‌కు ఈటల నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. దేశానికి ద్రోహం చేస్తున్న మతతత్వపార్టీ బీజేపీలో చేరాడని దుయ్యబట్టా రు. ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ‘ఈటలకు అన్యా యం జరిగింది.. అయ్యో పాపం..’ అనుకుని ఓటేస్తే గోస పడుతారని చెప్పారు. దళితుల భూములు తీసుకుని వందల ఎకరాల ఆసామిగా ఎదిగాడన్నా రు. ఈటల ఆస్తులపై చర్చ జరగాలని పేర్కొన్నా రు. ఓటమి భయంతోనే గోడ గడియారాలు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్పి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచారని ధ్వజమెత్తారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ ప్రజలకు చేసిందేంటో చెప్పాలని నిలదీశారు. అభివృ ధ్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్న కేసీఆర్‌ వైపే ప్రజలంతా నిలబడాలని, టీఆర్‌ఎస్‌కే ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు. జమ్మికుంట అభివృద్ధి బాధ్యత మా దేనని, కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎన్నికలు వచ్చేలోపే పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
క్రిస్టియన్లను ఆదుకుంటాం
క్రిస్టియన్ల ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తామని మం త్రి కొప్పుల భరోసానిచ్చారు. ఆదివారం పట్టణంలోని 80ఏళ్ల క్రితం నిర్మించిన సీఎస్‌ఐని సందర్శించారు. సీఎస్‌ఐ నిర్వాహకులు మంత్రికి స్వాగ తం పలికారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత చర్చి నిర్వాహకులు విజ్ఞప్తి చేసిన సమస్యలపై స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడా రు. చర్చి ప్రహరీకి నిధులిస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం..
మున్సిపల్‌ పరిధిలోని కొత్తపల్లిలో ఆదివారం టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని మంత్రి ఈశ్వర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరగా మంత్రి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తున్న బీజేపీని ఓడించాలని కోరారు. ఇక్కడ మున్సిపల్‌చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, వార్డు కౌన్సిలర్లు మల్లయ్య, లావణ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంపత్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మోసం చేసిన ఈటలకు గుణపాఠం చెప్పండి
మోసం చేసిన ఈటలకు గుణపాఠం చెప్పండి
మోసం చేసిన ఈటలకు గుణపాఠం చెప్పండి

ట్రెండింగ్‌

Advertisement