e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home కరీంనగర్ రైతన్న సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతన్న సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, న్యాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు
కేడీసీసీ బ్యాంక్‌, సహకార సంఘ భవన నిర్మాణ పనులకు భూమి పూజ

కోరుట్ల, సెప్టెంబర్‌ 16: తెలంగాణ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా పని చేస్తుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డీసీసీబీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని కల్లూరు రోడ్డు ఎస్సారెస్పీ క్వార్టర్స్‌ సముదాయంలో నూతనంగా నిర్మించనున్న కేడీసీసీ బ్యాంకు, సహకార సంఘ భవనం, గోదాం నిర్మాణ పనుల శిలాఫలకాలను ఎమ్మెల్యే, న్యాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ గురువారం అవిష్కరించి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నదాతల అభ్యున్నతి కోసం పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాక ముందు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఉండేవని, స్వరాష్ట్రంలో 25 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాంలను నిర్మించామన్నారు. 4 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారని, 4 కోట్ల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి అవుతుందన్నారు. రైతులకు అందుబాటులో ఉండేలా సొసైటీ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. పంట నిల్వ కోసం అవసరమైన చోట్ల గిడ్డంగులను నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వారు తెలిపారు. రైతుల మేలు కోరే ప్రభుత్వానికి అన్నదాతలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ అధ్యక్షురాలు అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, ఎంపీపీ తోట నారాయణ, జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్‌, సొసైటీ చైర్మన్‌లు, ఎఎంసీ అధ్యక్షులు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు శుభాకాంక్షల వెల్లువ..
టీటీడీ సభ్యుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును గురువారం ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు వచ్చిన ఎమ్మెల్యేకు జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, డీసీసీబీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావుతో పాటు పలువురు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement