e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home కరీంనగర్ టీటీడీ బోర్డు మెంబర్‌గా విద్యాసాగర్‌రావు

టీటీడీ బోర్డు మెంబర్‌గా విద్యాసాగర్‌రావు

1997లో రాజకీయ రంగ ప్రవేశం
2009లో ఎమ్మెల్యేగా ఎన్నిక
నాలుగు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం
ఏడాది క్రితం మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్ఠాన్‌ చైర్మన్‌గా బాధ్యతలు

మెట్‌పల్లి, సెప్టెంబర్‌ 15: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు అవకాశం వరించిం ది. టీటీడీ పాలకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం బుధవారం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగు రికి చోటు కల్పించగా అందులో విద్యాసాగర్‌ రావు ఒకరు ఉన్నారు.
రాజకీయ రంగ ప్రవేశం
విద్యాసాగర్‌రావు క్లాస్‌వన్‌ కాంట్రాక్టర్‌ వృత్తి నుంచి 1997లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీలో చేరారు. 1998లో మెట్‌పల్లి అసెంబ్లీ స్థా నానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓట మి చవిచూశారు. 2001లో ఇబ్రహీంపట్నం జడ్పీటీసీగా గెలుపొంది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌లో టీడీపీ పక్షనాయకుడిగా, 2002 నుంచి మూడేళ్ల పాటు కరీంనగర్‌ ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌గా పదవులు నిర్వర్తించారు. 2004లో సాధారణ ఎన్నిక ల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తాను సైతం భాగస్వామి కావాలనే సంకల్పంతో 2008లో పెద్ద సంఖ్యలో టీడీపీ క్యాడర్‌తో టీఆర్‌ఎస్‌ లో చేరారు. పునర్విభజనలో భాగంగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గం నుంచి 2009లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటి చేసి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావుపై ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. 2010 ఫిబ్రవరిలో తెలంగా ణ ఉద్యమంలో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. అదే సంవత్స రం జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండో సారి కాంగ్రెస్‌ అభ్యర్థి జువ్వాడి రత్నాకర్‌రావుపై భారీ మెజార్టీతో గెలుపొందారు. 2014, 2018 సార్వత్రి ఎన్నికల్లోనూ వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిం చారు. మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్ఠాన్‌ చైర్మన్‌ గా 2020 అక్టోబర్‌ 19 నుంచి కొనసాగుతున్నారు. సౌత్‌జోన్‌ తరపున జాతీయ ఖాదీ గ్రామీణ పరిశ్రమ ల సంస్థలో డైరెక్టర్‌గాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడడమే కాకుండా ఆధ్యాత్మిక చింతన ఎక్కువే.

తీరిక సమయం దొరికితే చాలు గుళ్లు, గోపురాలను దర్శిస్తారు. ఇప్పటివరకు అయ్యప్పస్వామి దీక్షను 33 సార్లు స్వీకరించడం విశేషం. ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం, శబరి మలై ఆలయాలను సందర్శిస్తారు. మెట్‌పల్లిలో అయ్యప్పస్వామి ఆలయం, వెల్లుల్ల రోడ్డులో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి కృషి చేశా రు. తన స్వగ్రామం మల్లాపూర్‌ మండలం రాఘవపేటలో సొంత నిధులతో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మింపజేశారు. మరెన్నో ఆలయాల నిర్మాణానికి విరాళాలు అందించి తన భక్తిభావాన్ని చాటుకున్నారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌ శివారులో జిల్లా సరిహద్దులో గల గండి హన్మాన్‌ ఆలయం ఆవరణలో 50 ఫీట్ల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని తన సొంత నిధులతో ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఈ మేరకు ఇటీవల కుటుంబ సమేతంగా పాల్గొని శంకుస్థాపన చేశారు. రాజకీయ నేతనే కాదు ఆధ్మాత్మిక వేత్తగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సభ్యుడిగా అవకాశం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana