e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home కరీంనగర్ గెల్లుకు మద్దతు

గెల్లుకు మద్దతు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌కు జై కొడుతున్న కులసంఘాలు
హుజూరాబాద్‌ పట్టణ స్వర్ణకార, ముదిరాజ్‌, మేర, ఉప్పర కులస్తుల తీర్మానం
మంత్రి గంగులకు తీర్మాన ప్రతులు అందజేత
అదే దారిలో మంతెనపల్లి గ్రామస్తులు

హుజూరాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 15;హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. గెల్లును గెలిపించుకుంటామంటూ సకల జనం జై కొడుతున్నది. బుధవారం హుజూరాబాద్‌ పట్టణంలోని సిటీ సెంట్రల్‌ హాల్‌లో ముదిరాజ్‌, స్వర్ణకార, మేర, ఉప్పర కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో గెల్లు గెలుపు కోసం తీర్మానాలు చేశారు. ఆ తర్వాత తీర్మాన ప్రతులను మంత్రికి అందించారు. రాబోయే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని, శ్రీనివాస్‌ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాం: మంత్రి గంగుల కమలాకర్‌
గత ప్రభుత్వాల హయాంలో కులసంఘాల అభ్యున్నతిని ఎవరూ పట్టించుకోలేదని, కానీ, స్వరాష్ట్రంలో అన్ని కుల సంఘాల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, బీసీలకు అండగా నిలిచింది ముఖ్యమంత్రి కేసీఆరేనని కొనియాడారు. స్వర్ణకార, ముదిరాజ్‌, మేర, ఉప్పర కులాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిషారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే పలు కుల సంఘాలకు స్థలాలను కేటాయించడంతోపాటు భవన నిర్మాణాల కోసం నిధులను కూడా మంజూరు చేశామని గుర్తు చేశారు.

- Advertisement -

ఈటల రాజేందర్‌ కేవలం తన స్వార్థం కోసం రాజీనామా చేశాడే తప్పా, ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు. అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయకుండా, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఏమి అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. అదే టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఇకడి ప్రజలు గెలుస్తారని, హుజూరాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌కు అండగా ఉండాలని, గెల్లును ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధికాశ్రీనివాస్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మలాశ్రీనివాస్‌, కౌన్సిలర్లు, కుల పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana