e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home కరీంనగర్ బీటీ రోడ్లకు నిధులు మంజూరు

బీటీ రోడ్లకు నిధులు మంజూరు

బీటీ రోడ్లకు నిధులు మంజూరు

సీఎం కేసీఆర్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చిత్ర పటాలకు పాలాభిషేకం
ధర్మారం, ఏప్రిల్‌14: మండలంలోని పలు మార్గాలను కలిపేందుకు బీటీ రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరవడంపై హర్షం వ్యక్తం చేస్తూ ధర్మారంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ సీఎం కేసీఆర్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చిత్ర పటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు. మంత్రి కృషి ఫలితంగా బీటీ రోడ్ల నిర్మాణాలకు పీఎంజీఎస్‌వై, పంచాయతీ రాజ్‌ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయని వారు వివరించా రు. బొట్లవనపర్తి ఎస్సీ కాలనీ, గొల్లపల్లి, ఖానంపల్లి మీదుగా పైడిచింతలపల్లి వరకు 5 కిలో మీటర్ల దూరం బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 3కోట్ల 34లక్షల 70 వేలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి వయా ఖిలావనపర్తి మీదుగా జూలపల్లి మండలం కుమ్మరికుంట శివారు వరకు 5 కిలోమీటర్ల దూరం బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 3కోట్ల34లక్షల39వేలు నిధులు మంజూరు కావడంతో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సీఎం, మంత్రి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎంపీపీ, జడ్పీటీసీ మాట్లాడుతూ, మంత్రి ఈశ్వర్‌ కృషితో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ. 6.69 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆయా రోడ్లతో ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నంది మేడారం ప్యాక్స్‌ చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, ధర్మారం సర్పంచ్‌ పూస్కూరు జితేందర్‌రావు, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉప సర్పంచ్‌ ఆవుల లత, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ రఫీ, ఆర్‌బీఎస్‌ బాధ్యులు పాకాల రాజయ్య, పాక వెంకటేశ్‌, నాయకులు మద్దునాల వెంకటేశ్‌, మూల మల్లేశం, సాగంటి కొండయ్య, కీసర స్వామి, బాస తిరుపతి రావు, దేవి రాజలింగయ్య, దేవి నళినీకాంత్‌, దేవి వంశీ, దేవి లావణ్య, కనమండ రమేశ్‌, కాంపెల్లి రాజయ్య, కల్లెపల్లి లింగయ్య, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీటీ రోడ్లకు నిధులు మంజూరు

ట్రెండింగ్‌

Advertisement