e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home కరీంనగర్ దుర్గాదేవీకి ప్రత్యేక పూజలు

దుర్గాదేవీకి ప్రత్యేక పూజలు

కాల్వశ్రీరాంపూర్‌, అక్టోబర్‌13: మండలం కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న జగత్‌మహామునీశ్వరస్వామి ఆలయంతో పాటు, రామదండు యూత్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవీ మండపాల వద్ద బుధవారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి హాజరై పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో విండో చైర్మన్‌ చదువు రాంచంద్రారెడ్డి, ఉప సర్పంచ్‌ సుదాటి కర్ణాకర్‌రావు, ఆలయ నిర్వాహకులు బసవత్తుల రాజమౌళీశ్వరస్వామి, ఆర్బీఎస్‌ మండల కన్వీనర్‌ నిదానపురం దేవయ్య, వార్డు సభ్యులు, భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
చండీ పారాయణం
ఓదెల, అక్టోబర్‌ 13: కొమిరె గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో నెలకొల్పిన దుర్గాదేవీ మండలంలో చండీ పారాయణం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతీ దేవీ అవతారంలో భక్తులకు అమ్మ వారు దర్శనమిచ్చారు. వేద పండితుడు నందగిరి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో చండీ పారాయణంలో భాగంగా సహస్రనామార్చన, మహా హారతి, చేసి పుస్తకాలతో రంగు, రంగు పూలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజ, చండీ యాగం నిర్వహించారు. హన్‌మాన్‌ యూత్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పూజల్లో సర్పంచ్‌ మూల ఉమామహేశ్వరి, ఉప సర్పంచ్‌ గోలి లింగారెడ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మూల ప్రేంసాగర్‌రెడ్డి, యూత్‌ సభ్యులు సాగర్‌, పబ్బ సిద్దు, పంజాల రాజు, అనిల్‌, అజయ్‌, సతీశ్‌, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జంక్షన్‌, అక్టోబర్‌ 13: పెద్దపల్లి ఎమ్మెల్యే తనయుడు, ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి, పెద్దపల్లి జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, కౌన్సిలర్లు సరేశ్‌బాబు, స్వామి, సుజాత సునీల్‌, పైడ పద్మరవితో కలిసి పెద్దపల్లిలోని పలు దుర్గామాత మండపాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఉప్పు రాజ్‌కుమార్‌, నూనేటి కుమార్‌, విక్రమ్‌, చొప్పరి అన్వేశ్‌, శ్రీకాంత్‌, వాసు, కృష్ణారెడ్డి, అరుణ్‌, సురేశ్‌, రాజేశ్‌, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement