e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home కరీంనగర్ ఉప ఎన్నికలో ‘గెల్లు’ గెలుపే లక్ష్యం

ఉప ఎన్నికలో ‘గెల్లు’ గెలుపే లక్ష్యం

22న హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి గౌడ ఆశీర్వాద సభ
పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి
మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్‌ పిలుపు

హుజూరాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 13: ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గౌడ సామాజికవర్గ అభ్యున్నతికి ఎంతో తోడ్పాటునందిస్తున్నారని, దీనికి కృతజ్ఞతగా రాబోయే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ గెలుపునకు గౌడ కులస్తులు పట్టుదలతో కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కోడూరి సత్యనారాయణగౌడ్‌ స్పష్టం చేశారు. సోమవారం హుజూరాబాద్‌ పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలతో గీత కార్మికులకు జరుగుతున్న మేలును గుర్తుచేశారు. త్వరలోనే ద్విచక్ర వాహనాలు కూడా ప్రభుత్వం ఇవ్వనున్నదని వెల్లడించారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు హుజూరాబాద్‌ పట్టణంలోని వ్యవసాయ మారెట్‌ యార్డు ఆవరణలో 10వేల మందితో గౌడ ఆశీర్వాద సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి ఎక్సైజ్‌, టూరిజం శాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎస్సీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌, బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్‌ తదితరులు హాజరవుతారని చెప్పారు. గౌడ సోదరులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు పట్టణ శివారులోని ఎస్సారెస్పీ కాలువ పక్కన గౌడ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని అధికారులు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. సమావేశంలో కరీంనగర్‌ కార్పొరేటర్‌ కోటగిరి భుమాగౌడ్‌, కౌన్సిలర్‌ తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, చొప్పదండి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రమేశ్‌గౌడ్‌, రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్‌, నాయకులు కోట రవిగౌడ్‌, వంగ హన్మంతుగౌడ్‌, బొనగాని ఎల్లాగౌడ్‌, శ్రీపతి ఎల్లయ్యగౌడ్‌, యాదగిరిగౌడ్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, పెరుమాండ్ల సదానందంగౌడ్‌, పావనిగౌడ్‌, వీరస్వామిగౌడ్‌, జితేందర్‌గౌడ్‌, కుమారస్వామిగౌడ్‌, రమేశ్‌గౌడ్‌, సుదర్శన్‌గౌడ్‌, అరుణగౌడ్‌, హరీశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana