e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home కరీంనగర్ మోడ్రన్‌ ధోబీఘాట్స్‌

మోడ్రన్‌ ధోబీఘాట్స్‌

మోడ్రన్‌ ధోబీఘాట్స్‌

సిరిసిల్లలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం
మంత్రి కేటీఆర్‌ చొరవతో 2.10 కోట్లు మంజూరు
చకచకా సాగుతున్న పనులు lఆనందంలో రజకులు

సిరిసిల్లటౌన్‌, ఏప్రిల్‌ 13: కుల వృత్తుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న సర్కారు, ఈ దిశగా మరో ముందడుగు వేసింది.. రజకుల సంక్షేమమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండు మోడ్రన్‌ ధోబీఘాట్లను నిర్మించాలని సంకల్పించింది. మంత్రి కేటీఆర్‌ చొరవతో 2.10 కోట్లు మంజూరు కాగా, అధికార యంత్రాంగం వెంటనే పనులు ప్రారంభించింది. సాధ్యమైనంత తొందరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది.

కాలక్రమేణా జీవన విధానంలో అనేక మార్పులు వస్తున్నాయి. వృత్తులు సైతం కొత్తగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ క్రమంలో చాకిరేవులు కనుమరుగయ్యాయి. ఇందుకు అనుగుణంగా సర్కారు సై తం కులవృత్తుల ఆధునీకరణ కు చర్యలు చేపట్టిం ది. ఉన్న ఊరిలో ఉపాధి కరు వై వలసెళ్లిపోతున్న రజకులకు అండగా ఉండాలని నిర్ణయించింది. సిరిసిల్ల పట్టణంలో మెకానైజ్డ్‌ ధోబీఘాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఉతకడం నుంచి ఇస్త్రీ దాకా అన్ని పనులు యంత్రాల ద్వారానే చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.

రెండుచోట్ల నిర్మాణం..
సిరిసిల్లలోని విద్యానగర్‌ మానేరు తీరంలోని మడేలేశ్వర ఆలయం వద్ద ఒకటి, వెంకంపేటలో మరొక ధోబీఘాట్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రజక సంఘాలతో చర్చించి 2019, జూన్‌ 30న పనులకు భూమిపూజ చేశారు. కోటీ 5 లక్షల చొప్పున రెండు ధోబీఘాట్ల కోసం 2.10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధుల నుంచే యంత్రాలను సైతం కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం వెంకంపేటలో చేపట్టిన ధోబీఘాట్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. విద్యానగర్‌లో చురుగ్గా సాగుతున్నాయి. సాధ్యమైన త్వర గా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

యంత్రాలతోనే అన్ని పనులు..
బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వంటి పనులను ఒకే చోట, అదీ యంత్ర సామగ్రి సహకారంతో చేసేలా ఘాట్లను నిర్మిస్తున్నారు. ఒకే గంటలో 90 కిలోల బట్టలను ఉతికి, ఇస్త్రీ చేసే సామర్థ్యం గల యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానంలో బట్టలను ఉతకడంతో నీ టి కాలుష్యం తగ్గిపోతుంది. నీరు సైతం వృథా కాదు. వృత్తిదారులకు శ్రమ తప్పుతుంది.

మంత్రి సూచనతో ముందుకు..
ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణానికి మొదట రజకులు ఆసక్తి చూపలేదు. సాంకేతికతతో తమ వృ త్తికి ఆదరణ తగ్గుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోడ్రన్‌ ధోబీఘాట్ల పనితీరుపై రజకులకు అవగాహన కల్పించాలని ము న్సిపల్‌ అధికారులకు సూచించారు. అమాత్యుడి సూచనల మేరకు రజక సంఘాలతో సమావేశాలు నిర్వహించి మోడ్రన్‌ ధోబీఘాట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ నేపథ్యంలో రజకులు వీటి నిర్మాణానికి ముందుకువచ్చారు.

శిక్షణకు ఏర్పాట్లు..
వందశాతం మెకానైజ్డ్‌ విధానంలో ఏర్పాటు చేస్తున్న యంత్రాల వినియోగంపై ముందుగా రజకులకు శిక్షణ అందిస్తారు. ఈ వృత్తిలో కొనసాగుతున్న మూడు తరాల వారి అభిరుచికి అనుగుణంగా తర్ఫీదు ఇవ్వనున్నారు. యువతకు ఆధునిక సాంకేతికపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

యువతకు ఉపాధి..
నేటి తరం చాకిరేవులకు వెళ్లి బట్టలను ఉతికేందుకు ఆసక్తి చూపడం లేదనే ఉద్దేశంతోనే సర్కారు మోడ్రన్‌ ధోబీఘాట్లను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో విద్యానగర్‌, వెంకంపేటలో రెండు చోట్ల నిర్మిస్తున్నాం. సాధ్యమైనంత త్వరలో అందుబా టులోకి తెస్తాం. ఆధునిక ధోబీఘాట్లతో యువతకు ఉపాధి దొరుకు తుంది. నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.

  • జిందం కళ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ (సిరిసిల్ల)

కేటీఆర్‌ చొరవతోనే..
మంత్రి కేటీఆర్‌ చొరవతో సిరిసిల్లలో మిషన్లతో బట్టలు ఉతికే యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. చాకిరేవు దగ్గరికి వెళ్లి బట్టలు ఉతికేందుకు నేటి యువత ఆసక్తి చూపడం లేదు. మెడ్రన్‌ ధోబీఘాట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నాం. యువత నుంచి మంచి ఆదరణ వస్తున్నది. ఇన్నేండ్ల చరిత్రలో రజకుల గురించి పట్టించుకున్న మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్‌ఎస్సే.

  • అక్కరాజు శ్రీనివాస్‌, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత

కొంప ముంచుతున్నఅతి విశ్వాసం

కొలువులన్నాడు.. కోట్లు కొల్లగొట్టాడు

నిర్మాత‌గా ర‌వితేజ‌..హీరో ఎవ‌రో తెలుసా..?

Advertisement
మోడ్రన్‌ ధోబీఘాట్స్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement