e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home కరీంనగర్ దళితుల సంక్షేమానికి సర్కారు పెద్దపీట

దళితుల సంక్షేమానికి సర్కారు పెద్దపీట

దళితుల నిజమైన ఆత్మబంధువు సీఎం కేసీఆర్‌
‘కేసీఆర్‌ దళిత బంధు’గా నామకరణం కోసం తీర్మానం
ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌

హుజూరాబాద్‌టౌన్‌, ఆగస్టు 1: దళితుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ పేరొన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఆదివారం మొదటిసారిగా హుజూరాబాద్‌కు వచ్చారు. స్థానిక అంబేదర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ఊరేగింపుగా కాలినడకన స్థానిక సిటీ సెంటర్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌ నిజమైన ఆత్మబంధువు అని కొనియాడారు. దళితబంధు పథకానికి ‘కేసీఆర్‌ దళితబంధు’ అని నామకరణం చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు సభికులతో కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్‌ నిజమైన దళిత పక్షపాతి అని, గతంలో ఏ ముఖ్యమంత్రి దళితులపై ఇంత ప్రేమ చూపలేదని అన్నారు. దళితుల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అన్ని విధాలా కృషి చేస్తూ, ఆదుకుంటున్నారని కొనియాడారు. దళితులను ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులంతా ఐక్యంగా ఉండి వచ్చే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.

సామాన్య దళితుడినైన తనను ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించిన సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీకి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అంకితభావంతో పని చేసే వారికి టీఆర్‌ఎస్‌లో తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒకరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం ఆయనను జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కరీంనగర్‌ మేయర్‌ వై సునీల్‌రావు, హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్లు గందె రాధిక, టీ రాజేశ్వర్‌రావు, ప్రముఖ వ్యాపారులు రాగి విజయ్‌కుమార్‌, కౌరు సుగుణాకర్‌రెడ్డి, దళిత, ప్రజా సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు శాలువాలు కప్పి, పూలమాలలు, పుష్పగుచ్ఛాలు, గజమాలలతో ఘనంగా సతరించారు.

- Advertisement -

కాగా, కుటుంబ సభ్యులతో కలిసి బండ శ్రీనివాస్‌ తన తల్లికి పాదపూజ చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో దళిత నాయకుడు వేల్పుల రత్నం, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల శాఖ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్‌, సంగెం ఐలయ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌, దళిత ప్రజా సంఘాల నాయకులు పాక సతీశ్‌, బత్తుల సమ్మయ్య, కిషన్‌రావు, కే రమేశ్‌, రాజయ్య, గందె శ్రీనివాస్‌, యాదగిరినాయక్‌, రాజేంద్రప్రసాద్‌, కుమారస్వామి, పూర్ణచందర్‌, కే శ్రీనివాస్‌, ఆర్‌ అశోక్‌, ఎం రమేశ్‌, ఎస్‌ బాబు, మహేందర్‌యాదవ్‌, గోపాల్‌రావు, దురై రాజు, రాజు, ఇమ్రాన్‌, గఫార్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana