శనివారం 30 మే 2020
Karimnagar - Jan 08, 2020 , 14:53:39

ప్లాస్టిక్‌పై సమరం

ప్లాస్టిక్‌పై సమరం
  • - ఊరూరా జోరుగా సేకరణ
  • - ప్రజలకు అవగాహన కార్యక్రమాలు
  • - ఆరో రోజూ ఉత్సాహంగా పల్లె ప్రగతి
  • - పలు గ్రామాల్లో ట్రాక్టర్ల పంపిణీ, - నల్లగొండలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పల్లె ప్రగతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ పంపిణీ చేశారు. స్థానిక లక్ష్మీనరసింహ దేవాలయం ఆవరణలో హైమాస్ లైట్లను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. తడిపొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. తిమ్మాపూర్‌లో ఎంపీపీ వనిత స్థానికులతో కలిసి శ్రమదానం చేశారు. నేదునూరు, రేణికుంటలో ఈజీఎస్ ఏపీడీ మంజులాదేవి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చారు. గన్నేరువరం మండలం పారువెల్ల, కాసింపేట డీఎస్‌పీఓ హరికిషన్ పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి కలెక్షన్ యూనిట్‌కు తరలించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ మల్లారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. చిగురుమామిడి మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీలు నిర్వహించారు. శంకరపట్నం మండలం కేశవపట్నంలో ఎంపీపీ సరోజ, జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ప్రత్యేక అధికారి జయశంకర్, ఎంపీడీఓ వినోద తడిపొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. ముంజంపల్లిలో పాడుబడిన బావులను పూడ్చివేశారు. మద్దికుంటలో శ్రమదానం చేశారు.
* జమ్మికుంట మండలం నగురం, నాగారంలో జిల్లా ప్రత్యేక అధికారి రాజర్షిషా కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు కిలో బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. ఇల్లందకుంట మండలం మల్యాలలో నర్సరీలను సందర్శించారు. సైదాపూర్ మండలం సోమారం దుద్దెనపల్లిలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ కంపోస్టు ఎరువుల షెడ్డు పనులను పరిశీలించారు. హుజూరాబాద్ మండలం శాలపల్లి, ఇందిరానగర్, రాజాపల్లిలో ఎంపీపీ ఈ రాని ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. వీణవంక మండలం లస్మక్కపల్లిలో శ్రమదానం చేశారు.

రామడుగు మండలం రంగసాయిపల్లిలో పల్లెప్రగతి ఫ్లయింగ్ స్కాడ్ పనులను పరిశీలించారు. డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, ప్రాథమిక పాఠశాల, నర్సరీలను పరిశీలించి, డీపీఓ రఘువరన్‌తో కలిసి మొక్కలు నాటారు. గంగాధర, చొప్పదండి మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగాయి.


logo