e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home కరీంనగర్ సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

రామడుగు, జూలై 28: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. రామడుగు మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఆయన మండలంలోని 248 మంది లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించడంలో సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఆడబిడ్డల పెండ్లికి రూ. లక్షా నూటపదహార్లు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాళేశ్వరం జలాలతో పంటలు పుష్కలంగా పండి, దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డులు కూడా త్వరలో మంజూరవుతాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో ఎన్నార్‌ మల్హోత్రా, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు శుక్రొద్దీన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఎంపీటీసీ మడ్డి శ్యాంసుందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కలిగేటి లక్ష్మణ్‌, పంజాల జగన్‌మోహన్‌గౌడ్‌, వీర్ల రవీందర్‌రావు, సంజీవరావు, జుట్టు లచ్చయ్య, గుండి ప్రవీణ్‌, సైండ్ల కరుణాకర్‌, నరిబాబు, చిరుత రాంచంద్రం, కొడిమ్యాల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana