e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home కరీంనగర్ రేషన్‌కార్డుల పంపిణీ

రేషన్‌కార్డుల పంపిణీ

పెగడపల్లి, జూలై 29: మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 237 మందికి నూతన రేషన్‌కార్డులను ఎంపీపీ గోళి శోభ బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, డీటీ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, ఏఎంసీ చైర్మన్‌ నగావత్‌ తిరుపతినాయక్‌, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ ఉప్పుగండ్ల నరేందర్‌రెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు రహీం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ఆర్‌ఐలు శరత్‌, అనిల్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
వెల్గటూర్‌, జూలై 29: మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయ ఆవరణంలో వివిధ గ్రామాలకు చెందిన 246 మందికి నూతన రేషన్‌ కార్డులను వెల్గటూర్‌ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు ఏలేటి కృష్ణారెడ్డి, మండల నాయకులతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజేందర్‌, ఎంపీడీవో సంజీవరావు, ఆర్‌ఐ స్వామి, సింగిల్‌ విండో చైర్మన్‌ గూడ రాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మండలకేంద్రంలోని శ్యాం సుందర్‌ రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో మండలంలోని 220మందికి ఆహార భద్రతా కార్డులను అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలో ఇప్పటివరకు 823అంత్యోదయ కార్డులు, 14,079 ఆహార భద్రతా కార్డులున్నాయని, ఇప్పుడు కొత్తగా 220మందికి కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జలంధర్‌, ఏఎంసీ చైర్మన్‌ ముస్కు లింగారెడ్డి, చందోలి సహకార సంఘం అధ్యక్షుడు మాధవరావు, వైస్‌ ఎంపీపీ సత్తయ్య, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గంగాధర్‌, గొల్లపల్లి సర్పంచ్‌ నిశాంత్‌ రెడ్డి, జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు అమ్జద్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ అలీ, తహసీల్దార్‌ నవీన్‌ కుమార్‌, నాయబ్‌ తహసీల్దార్‌ సుమన్‌, ఆర్‌ఐలు రాజేందర్‌ రావు, ప్రసాద్‌ రావు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana