e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home కరీంనగర్ రుణమాఫీపై సర్వత్రా హర్షం

రుణమాఫీపై సర్వత్రా హర్షం

  • సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు
  • పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు

జగిత్యాల రూరల్‌, ఆగస్టు 2: రైతులకు రూ. 50వేలు వరకు రుణమాఫీ చేయాలని మంత్రివ ర్గం కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై రైతులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణంలోని ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఆర్‌బీఎస్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడు తూ, సీఎం కేసీఆర్‌ రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షలోపు ఉన్న బ్యాంక్‌ రుణాలు మాఫీ చేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు రూ.25వేల మాఫీ జరిగిందని, ఇప్పుడు రూ.50వేల వరకు మాఫీ చేస్తామని కేబినేట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌ రూరల్‌, అర్బన్‌ మండలాల అధ్యక్షులు నక్కల రవీందర్‌రెడ్డి, జుంబర్తి శంకర్‌, జిల్లా సభ్యులు దుమ్మని బాలముకుందం, దామోదర్‌రావు, ప్యాక్స్‌ చైర్మన్లు మహిపాల్‌ రెడ్డి, సందీప్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జాన్‌, ఆర్‌బీఎస్‌ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.

సహకార సంఘం ఆవరణలో
భూషణరావుపేట సహకార సంఘం ఆవరణలో సోమవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో రుణమాఫీపై తీసుకున్న నిర్ణయం ప్రశంశనీయమని, 2018లో మొదటి విడుత రూ.25వేల వరకు మాఫీ జరిగిందని, కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం ఉన్నా రెండో విడుత ఆగస్టు 15 నుంచి రూ. 50 వేల వరకు రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం ద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని వివరించారు. 57ఏళ్ల వారికి ఆసరా పింఛన్‌ ఇస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయమని అన్నారు. సమావేశంలో జడ్పీటీసీ నాగం భూమయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు దొప్పల జలేంధర్‌, పూండ్ర జనార్దన్‌రెడ్డి, బత్తుల నరేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, పుల్లారెడ్డి, శేఖర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, పోచంపెల్లి నర్సయ్య, గణేశ్‌, బద్దం మహేందర్‌రెడ్డి, ముస్కు శ్రీనివాస్‌రెడ్డి, దేవారెడ్డి, తెడ్డు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

రైతు వేదికలో, పంట పొలాల్లో
మండలకేంద్రంలోని రైతువేదిక ఆవరణలో ప్రజాప్రతినిధులు, పంటపొలాల్లో రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషే కం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ రైతుల బంధువుగా నిలుస్తున్నారని ఆర్‌బీఎస్‌ జిల్లా సభ్యుడు కొల్ముల రమణ అన్నారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ మేర్గు రాజేశం, ప్రజాప్రతినిధులు గర్షకుర్తి శిల్ప, మేసు ఏసుదాసు, సృజన, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి శీలం రమేశ్‌, నాయకులు ముక్క వెంకటేశ్‌, సుధ నారాయణ, నాయకులు ముల్కు, బందెల రాజేశం, పూడూరి సుధాకర్‌, శీలం రవి, జలేంధర్‌, సైండ్ల మల్లయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమానికి కృషి
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ జేడీ సరస్వతి పేర్కొన్నారు. సోమవారం ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రూ. 50 వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై రైతులు ఆనందంలో ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana