e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home కరీంనగర్ ముదిరాజ్‌ల ఎదుగుదలకు సీఎం కృషి

ముదిరాజ్‌ల ఎదుగుదలకు సీఎం కృషి

  • తెలంగాణలో దళారుల వ్యవస్థ పూర్తిగా తొలగిపోయింది
  • ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్‌కు ఎకరం భూమి, రూ.కోటి మంజూరు
  • ముదిరాజ్‌ నేతల హర్షం

హుజూరాబాద్‌టౌన్‌, సెప్టెంబర్‌ 20: రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముదిరాజ్‌ల ఎదుగుదలకు సీఎం కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు పోలు లక్ష్మణ్‌, కేడీసీసీ, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పింగిళి రమేశ్‌ పేర్కొన్నారు. సోమవారం హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 25 వేల పైచిలుకు ముదిరాజ్‌ ఓటర్లున్నారని తెలిపారు. హుజూరాబాద్‌ పట్టణంలోని బోర్నపల్లిలో సర్వే నంబర్‌ 248లో ఎకరం భూమితో పాటు ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్‌ జీవో 571 విడుదల చేయడంతో సీఎం కేసీఆర్‌, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు కులస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తామ ని, అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం చెరువులు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లలు వేస్తూ మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఉచితంగా వాహనాలు అందించి, మారెటింగ్‌ సదుపాయం మెరుగుపరిచి గొప్పగా ఆదరిస్తున్నదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని, సీఎం నిలబెట్టిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ముదిరాజ్‌ సంఘం హుజూరాబాద్‌ మండల అధ్యక్షుడు గంట మధుకర్‌ముదిరాజ్‌, వీణవంక వైస్‌ ఎంపీపీ లతాశ్రీనివాస్‌, నాయకులు గూళ్ల ఐలయ్య, పింగళి శ్రీనివాస్‌, జవ్వాజి చిరంజీవి, నిమ్మ రాజయ్య, జవ్వాజి అనిల్‌, మహంకాళి రాజు, కరుణాకర్‌, పింగిళి సురేశ్‌, గంట కొమురయ్య, కుట్ట రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement