e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home కరీంనగర్ డీజిల్‌ పేరిట బురిడీ

డీజిల్‌ పేరిట బురిడీ

  • తక్కువ ధరకు అమ్ముతానంటూ కుచ్చుటోపీ
  • తరచూ ఇదే తరహాలో మోసాలు
  • శంకరపట్నం మండలం గద్దపాకకు
  • చెందిన రైతు ఫిర్యాదుతో వెలుగులోకి
  • పోలీసుల అదుపులో నిందితుడు
  • రెండు బైక్‌లు, రూ. 8500 నగదు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన హుజూరాబాద్‌ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి

హుజూరాబాద్‌, సెప్టెంబర్‌ 20: తక్కువ ధరకు డీజిల్‌ ఇప్పిస్తానని నమ్మబలుకుతాడు..నగదు ముట్టగానే తప్పుదోవ పట్టించి పత్తాలేకుండా పో తాడు.. తరుచూ ఇదే తరహాలో మోసాలు చేస్తూ జల్సాలకు అలవాటుపడిన ఓ మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు..హుజూరాబాద్‌ ఏసీసీ వెంకట్‌రెడ్డి సోమవారం నిందితుడి అరెస్ట్‌ను చూ పి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జి ల్లా మరిపెడలోని గాంధీబజార్‌కు చెందిన కు డితి భరత్‌రెడ్డి ఈ నెల 10న కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన రాచర్ల శ్రీనివాస్‌ దగ్గరికి వచ్చాడు. తనను తాను పరిచయం చేసుకుని తాను సెల్‌ టవర్లలో పనిచేస్తానని చెప్పా డు. తన వద్ద 400 లీటర్ల డీజిల్‌ ఉందని, లీటర్‌కు రూ.70 చొప్పున అమ్ముతానని చెప్పాడు. ఇం దుకు రూ. 28వేలు అవుతాయని సగం డబ్బులు ఇస్తే డీజిల్‌ వస్తుందని నమ్మబలికాడు. దీంతో శ్రీనివాస్‌ రూ14వేలు భరత్‌కు ముట్టజెప్పాడు. ఈ క్రమంలో భరత్‌ ట్రాక్టర్‌లో రెండు డ్రమ్ములతో డీ జిల్‌ కోసమని శంకరపట్నంలోని ఓ బంక్‌కు శ్రీనివాస్‌, అతడి స్నేహితుడిని తీసుకెళ్లాడు. ఇకడ డీజిల్‌ లేదని చెప్పి, మొలంగూర్‌ పెట్రోల్‌ బంక్‌ దగ్గరికి తీసుకెళ్లాడు. భరత్‌ బంక్‌ లోపలికి వెళ్లి ఓనర్‌ పూజలో ఉన్నాడని కాసేపటి తర్వాత రమ్మన్నాడని కట్టుకథలు చెప్పాడు.

ఈ లోగా తన డబ్బులతో మద్యం తాగిస్తానని దగ్గరలోని వైన్‌షాపునకు తీసుకెళ్లాడు. మద్యం తాగుతూ మాటలు కలిపి మా వరర్‌ వస్తున్నాడు.. మీకు ఉచితంగా గ్రీస్‌ కూడా తెస్తున్నాడని చెప్పి ఆశలు రేకేత్తించా డు. మనం కూర్చొన్న దుకాణం వర్కర్‌కు తెలియదట.. నేను వెళ్లి తీసుకొస్తానని నమ్మించి శ్రీనివాస్‌ బైక్‌ను తీసుకొని భరత్‌ బయటపడ్డాడు. అతడు ఎంతకు తిరిగి రాకపోవడంతో మోసపోయామని భావించి శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా, సోమవారం ఉదయం 8.30 గంటలకు మొలంగూర్‌ క్రాస్‌ నుంచి సైదాపూర్‌కు వెళ్తున్నాడనే పక్కా సమాచారంతో హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ కిర ణ్‌, శంకరపట్నం ఎస్‌ఐ ప్రశాంత్‌రావు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. రెండు బైక్‌లు, రూ. 8500 స్వాధీనం చేసుకున్నారు. విచారించగా నేరాలను ఒప్పుకున్నాడు.

- Advertisement -

జల్సాలకు అలవాటు పడి…
ఉన్నత కుటుంబానికి భరత్‌రెడ్డి జల్సాలకు అలవాటు పడి సులవుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. వరంగల్‌ బస్టాండ్‌ వద్ద గల లా డ్జిల్లో ఉంటూ పలు జిల్లాల్లో తిరుగుతూ బస్టాండ్‌, హోటళ్లు, కిరాణ షాపుల వద్ద మకాం వేసేవాడు. అకడికి వచ్చే వాళ్లను మిషన్‌ భగీరథ, సెల్‌ టవ ర్స్‌, మోటర్‌ ఫీల్డ్‌లో పని చేస్తున్నామని నమ్మించేవాడు. ఇలా మాటలు కలుపుతూ తన వద్ద డీజిల్‌ ఉందని, తకువ రేటుకు అమ్ముతానని వ ల పన్నేవాడు. తన బుట్టలో పడిన వారిని నిండా ముంచుతాడు. దొంగిలించిన బైక్‌లను అమ్మి, డీజిల్‌ పేరిట మోసం చేసిన డబ్బులతో జల్సాలు చేసేవాడు.

పలు జిల్లాల్లో 18కేసులు
భరత్‌రెడ్డిపై ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, మ హబూబాబాద్‌, జనగామ జిల్లాలో 18 కేసులు న మోదయ్యాయి. పలు మార్లు జైలుకి వెళ్లి వచ్చా డు. తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుండా మరల పాత తరహాలోనే మోసాలను చేస్తున్నాడు. జిల్లాలో శంకరపట్నం, జమ్మికుంట పోలీస్‌స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. నిందితులను ప ట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ కిరణ్‌, ఎస్‌ఐ ప్రశాంత్‌రావు, కానిస్టేబుళ్లు చాడ భాస్కర్‌రెడ్డి, అన్నాడి కృష్ణారెడ్డి, హోం గార్డు అరుణాచలంను ఏసీపీ అభినందించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement